lucky zodiac signs:దీపావళి తర్వాత ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే.. దీపావళి, చాలా మందికి ఇష్టమైన పండుగల్లో ఒకటి. 2025లో ఈ పండుగ అక్టోబర్‌లో వస్తుంది. ఈ సంవత్సరం దీపావళి నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో బుధ గ్రహ సంచారం జరగనుంది, దీని వల్ల నాలుగు రాశుల వారికి ఆర్థిక లాభాలు చేకూరనున్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం సాధారణం. అక్టోబర్ 24న బుధ గ్రహం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. వృశ్చిక రాశిని కుజుడు పాలిస్తుండగా, బుధుడు ఈ రాశిలో సంచరించడం వల్ల నాలుగు రాశుల వారికి ఆర్థికంగా శుభ ఫలితాలు లభిస్తాయి.
కుంభ రాశి: దీపావళి నుంచి కుంభ రాశి వారికి అనేక లాభాలు కలుగనున్నాయి. వీరు చేపట్టే ఏ పనైనా విజయవంతమవుతుంది. వ్యాపారస్తులు గణనీయమైన లాభాలు ఆర్జిస్తారు. భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇది అనుకూల సమయం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా బాగా లాభపడతారు, సంతోషకరమైన జీవితం గడుపుతారు.
మిథున రాశి: అక్టోబర్ 24 తర్వాత మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమవుతుంది. ఇంటా, బయటా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పొందుతారు. కోరుకున్న కోర్కెలు నెరవేరతాయి, ఆనందమయ జీవితం ఉంటుంది.
సింహ రాశి: దీపావళి తర్వాత సింహ రాశి వారికి అన్నీ లాభదాయకంగా మారతాయి. కళారంగంలో ఉన్నవారికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గి, డబ్బు ఆదా చేస్తారు. చేతిలో డబ్బు ఉండటంతో ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.
మీన రాశి: బుధ గ్రహ సంచారం వల్ల మీన రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరతాయి. అక్టోబర్ 24న బుధుడు మీన రాశి రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు, అన్ని సౌకర్యాలను అందిస్తాడు. బుధుని అనుగ్రహంతో కష్టాలు తొలగి, ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.