Skin Care Tips: నోటి చుట్టూ చర్మం నల్లగా మారిందా..? ఈ చిట్కాలను పాటించండి.. నోటి చుట్టూ నల్లటి మచ్చలు కొంతమందిలో సాధారణంగా కనిపిస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఈ మచ్చలు మరింత స్పష్టంగా, అందవిహీనంగా కనిపిస్తాయి,
ముఖ్యంగా నుదుటి, బుగ్గలు, ముక్కు చుట్టూ. లేజర్ చికిత్సలు, మార్కెట్‌లో లభించే క్రీముల కంటే ఇంట్లో సులభంగా చేసుకోగలిగిన నివారణలు మెరుగైన ఫలితాలను ఇస్తాయి. నోటి చుట్టూ నల్లటి చర్మాన్ని తగ్గించడానికి కొన్ని సహజ ఇంటి చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
1. పసుపు-నిమ్మరసం మిశ్రమం ఒక టీస్పూన్ నిమ్మరసంలో చిటికెడు పసుపు పొడి కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని నల్లటి చర్మంపై రాసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఈ చిట్కా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
2. బంగాళాదుంప రసం తాజా బంగాళాదుంప రసాన్ని లేదా బంగాళాదుంప ముక్కను నోటి చుట్టూ నల్లటి ప్రాంతంపై రుద్దండి. బంగాళాదుంపలోని సహజ బ్లీచింగ్ గుణాలు నల్లటి మచ్చలను తొలగించి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతాయి.
3. కలబంద జెల్ ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్‌లో ఒక విటమిన్ E క్యాప్సూల్‌ను కలపండి. ఈ మిశ్రమాన్ని నల్లటి చర్మంపై రాసి, రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం చల్లటి నీటితో కడిగేయండి. ఈ విధానం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
4. శనగపిండి మాస్క్ ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ పాలు, చిటికెడు పసుపు కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్‌ను నల్లటి చర్మంపై రాసి 10-15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.
5. బొప్పాయి పేస్ట్ బొప్పాయిలో విటమిన్ A, C సమృద్ధిగా ఉంటాయి, ఇవి నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. పచ్చి బొప్పాయిని మెత్తగా మాష్ చేసి, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్‌ను నోటి చుట్టూ రాసి 10-15 నిమిషాలు ఉంచి, చల్లటి నీటితో కడిగేయండి.
గమనిక: ఈ చిట్కాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడ్డాయి. ఈ నివారణలను ప్రయత్నించే ముందు, మీ చర్మానికి సరిపడతాయా అని తెలుసుకోవడానికి చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.