BeetRoot Juice:బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. ఇది రక్తహీనత సమస్యలు ఉన్నవారికి రక్త ఉత్పత్తిని పెంచుతుంది, కాలేయం మరియు గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది, మరియు రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే చర్మం కాంతివంతంగా మారి ముఖం మెరుస్తుంది.
అయితే, ఆరోగ్యకరమైనది అని దీనిని అతిగా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే, బీట్‌రూట్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. కొందరికి ఇది హాని కలిగించవచ్చు. ఈ విషయాల గురించి తెలుసుకుందాం.
బీట్‌రూట్ జ్యూస్‌ను చాలా మంది తమ ఆహారంలో భాగంగా తీసుకుంటారు. ప్రస్తుతం ఇది ఆరోగ్యకరమైన పానీయంగా ప్రజాదరణ పొందింది. కానీ, అతిగా తీసుకుంటే కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు. అవేంటో చూద్దాం:
జీర్ణ సమస్యలు: బీట్‌రూట్ జ్యూస్‌లో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఉబ్బరం, గ్యాస్, మరియు కొందరికి విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు రావచ్చు.
జుట్టు రాలడం: బీట్‌రూట్‌లో ఆక్సలేట్‌లు అధికంగా ఉంటాయి, ఇవి శరీరంలో జింక్ శోషణను అడ్డుకుంటాయి. జింక్ లోపం వల్ల జుట్టు రాలే సమస్య ఏర్పడవచ్చు.
రక్తపోటు తగ్గడం: బీట్‌రూట్ జ్యూస్ రక్తపోటును నియంత్రిస్తుంది, కానీ అతిగా తాగితే తక్కువ రక్తపోటు ఉన్నవారికి సమస్యలు రావచ్చు. బీపీ ఒక్కసారిగా తగ్గి స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. హై బీపీ ఉన్నవారు కూడా దీనిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
మధుమేహ ప్రమాదం: బీట్‌రూట్‌లో సహజ చక్కెర ఉంటుంది. జ్యూస్ చేసేటప్పుడు ఫైబర్ తొలగిపోతుంది, దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం.
మూత్రపిండ రాళ్లు: బీట్‌రూట్‌లోని ఆక్సలేట్‌లు కాల్షియంతో కలిసి స్ఫటికాలను ఏర్పరిచి, మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.
క్యాన్సర్ ప్రమాదం: బీట్‌రూట్‌లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. దీనిని అతిగా తాగడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరిగి, N-నైట్రోసో సమ్మేళనాలు ఏర్పడతాయి, ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికల ఆధారంగా రూపొందించబడింది. బీట్‌రూట్ తీసుకోవడం గురించి ఏవైనా సందేహాలు ఉంటే, తప్పకుండా వైద్య నిపుణులను సంప్రదించండి.