OG Theatrical Business : OG ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో తెలుసా..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమా సెప్టెంబర్ 25, 2025న విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నిన్న విడుదలైన ట్రైలర్ ఈ హైప్‌ను మరింత పెంచింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగానే అన్ని షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి, ఇప్పటికే సుమారు 50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
OG సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన చిత్రంగా నిలిచింది. టాలీవుడ్ సమాచారం ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ వివరాలు ఇలా ఉన్నాయి:
నైజాం: 54 కోట్లు
సీడెడ్: 22 కోట్లు
ఉత్తరాంధ్ర: 20 కోట్లు
ఈస్ట్: 12 కోట్లు
వెస్ట్: 9 కోట్లు
గుంటూరు: 12 కోట్లు
కృష్ణ: 9 కోట్లు
నెల్లూరు: 6 కోట్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి మొత్తం 144 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి.
మిగతా భారతదేశం: సుమారు 10 కోట్లు
ఓవర్సీస్: 17 కోట్లు
మొత్తంగా, OG సినిమా ప్రపంచవ్యాప్తంగా 171 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది, ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రికార్డు స్థాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే కనీసం 175 కోట్ల షేర్ (సుమారు 350 కోట్లకు పైగా గ్రాస్) వసూళ్లు రాబట్టాలి.
సినిమాపై ఉన్న భారీ హైప్, 50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్, దసరా సెలవులు, టికెట్ ధరల పెంపుతో OG సులభంగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని భావిస్తున్నారు. అభిమానుల అంచనా ప్రకారం, ఈ చిత్రం 500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, పవన్ కెరీర్‌లో తొలి 100 కోట్ల షేర్ సినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. మొత్తానికి, OG థియేటర్లలో భారీ వసూళ్లతో సందడి చేయనుంది.