OG Movie:OG సినిమా సక్సెస్ కావడానికి ఈ నాలుగు ఎలివేషన్ సీన్స్ సరిపోతాయా? సలార్ కూడా పనికిరాదా.. OG సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్‌ను చాటిచెప్పేలా OG సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్‌గా, అత్యంత వైల్డ్ లుక్‌లో కనిపించారు. ఇప్పటివరకు ఏ దర్శకుడూ ఆయన్ను ఇలాంటి రేంజ్‌లో చూపించలేదనేంతగా ట్రైలర్ ఆకట్టుకుంది. దర్శకుడు సుజీత్ ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
సినిమాలో మూడు ఎలివేషన్ సీన్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని సమాచారం. ఇప్పటివరకు ఎవరికీ దక్కని స్థాయిలో పవన్ కళ్యాణ్‌కు ఈ సీన్స్ ఎలివేట్ చేయబోతున్నాయట. అవి ఏంటంటే:
ఇంట్రడక్షన్ సీన్: పవన్ కళ్యాణ్ ముంబైలోకి అడుగుపెట్టే సన్నివేశం అదిరిపోయే ఎలివేషన్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుందని సంగీత దర్శకుడు తమన్ గతంలో చెప్పారు.
ఇంటర్వెల్ బ్యాంగ్: నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సన్నివేశం హైలైట్‌గా నిలుస్తుందట.
క్లైమాక్స్: ఇంటర్వెల్‌ను మించే స్థాయిలో క్లైమాక్స్ ఉంటుందని టాక్.
ముంబై ఎంట్రీ సీన్: జనం OG కోసం ఎదురుచూస్తున్న సమయంలో పవన్ ముంబైలోకి ఎంట్రీ ఇచ్చే సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుందట.
ఈ మూడు సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయని యూనిట్ నుంచి వార్తలు వస్తున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత పవన్ అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ నాలుగు సీన్స్ సినిమా అంచనాలను అందుకోనున్నాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఇంటర్వెల్ ఫైట్ సీన్ సలార్ సినిమాలోని కాటేరమ్మ ఫైట్‌ను మించే స్థాయిలో ఉంటుందని, రక్తపాతంతో కూడిన ఈ ఫైట్‌లో స్వచ్ఛమైన ఎమోషన్ కూడా ఉంటుందని సుజీత్ గతంలో తెలిపారు. ఈ సినిమా సక్సెస్ పవన్ కళ్యాణ్‌కు, సుజీత్‌కు ఎంతో కీలకం. మరి, ఈ నాలుగు ఎలివేషన్ సీన్స్ సినిమాను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తాయా? సలార్ స్థాయిని మించే రేంజ్‌లో ఈ సీన్స్ ఉంటాయా? అనేది చూడాలి.