Upcoming Movies:పండుగ సీజన్‌లో కొత్త సినిమాల సందడి.. అక్టోబర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఇవే!

Upcoming Movies:పండుగ సీజన్‌లో కొత్త సినిమాల సందడి.. అక్టోబర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఇవే! సినిమా ఇండస్ట్రీకి పండుగలతో విడదీయలేని అనుబంధం ఉంది. పండుగ సమయంలో సినిమాలు విడుదల చేయడం ద్వారా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన సందర్భాలు ఎన్నో. 

మంచి కంటెంట్‌తో కూడిన సినిమా ఫెస్టివల్ సీజన్‌లో రిలీజ్ అయితే థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు ఖాయం. ఈ దసరా నుంచి దీపావళి వరకు బాక్సాఫీస్‌ను హీటెక్కించే సినిమాలు ఏవో చూద్దాం.

సెప్టెంబర్‌లో చిన్న సినిమాల నుంచి భారీ చిత్రాల వరకు విజయాలు సాధించాయి. చాలా రోజుల తర్వాత సంక్రాంతి సీజన్‌ను తలపించే సినిమా వేవ్ కనిపించింది. ఆగస్టు చివరలో విడుదలైన కొత్త లోక, లిటిల్ హార్ట్స్, మిరాయ్ వంటి సినిమాలు పాజిటివ్ టాక్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. 

పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ భారీ అంచనాల మధ్య విడుదలై, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మంచి టాక్ సొంతం చేసుకొని, వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఘాటి, మదరాసి వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ, మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి.

ముఖ్యంగా తేజా సజ్జా నటించిన మిరాయ్, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలు భారతీయ బాక్సాఫీస్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో మిలియన్ డాలర్ల వసూళ్లతో తెలుగు సినిమాకు మరింత కీర్తి తెచ్చాయి. ఈ జోష్‌ను కొనసాగిస్తూ, అక్టోబర్‌లో కూడా వరుసగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు ఒకే నెలలో రావడంతో బాక్సాఫీస్ మరింత సందడిగా మారనుంది.
దసరా స్పెషల్ రిలీజ్‌లు
October movies
ఇడ్లీ కొట్టు: స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో, హీరోగా నటించిన ఇడ్లీ కొట్టు అక్టోబర్ 1న విడుదల కానుంది. నిత్యామీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరిగే ఎమోషనల్ డ్రామాగా రూపొందింది.

కాంతార: చాప్టర్ 1: రిషబ్ శెట్టి దర్శకత్వంలో, హీరోగా నటించిన కాంతార: చాప్టర్ 1 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్లాక్‌బస్టర్ కాంతారకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం, పాన్ ఇండియా స్థాయిలో 7,000కు పైగా థియేటర్లలో విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో ఈ సినిమా హైప్ మరింత పెరిగింది.

శశివదనే: రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం శశివదనే అక్టోబర్ 10న విడుదల కానుంది. సాయిమోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమా యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది.
దీపావళి ధమాకా

దీపావళి వారంలో బాక్సాఫీస్‌ను హీటెక్కించేందుకు వరుస సినిమాలు సిద్ధంగా ఉన్నాయి:

మిత్రమండలి: ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ మిత్రమండలి అక్టోబర్ 16న రిలీజ్ కానుంది.

తెలుసు కదా: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన తెలుసు కదా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ లవ్ స్టోరీ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.

డ్యూడ్: అదే రోజు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ సినిమా కూడా విడుదలవుతోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

కె-ర్యాంప్: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కె-ర్యాంప్ అక్టోబర్ 18న విడుదల కానుంది. లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీతో కూడిన మాస్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది.
బాహుబలి: ది ఎపిక్

అక్టోబర్ చివర్లో బాక్సాఫీస్‌ను మరింత హీటెక్కించేందుకు బాహుబలి: ది ఎపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి: ది బిగినింగ్ మరియు బాహుబలి: ది కంక్లూజన్ చిత్రాలను కలిపి ఒకే సినిమాగా రీ-ఎడిట్ చేసిన ఈ వెర్షన్, అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం మరోసారి దేశవ్యాప్తంగా బాహుబలి మానియాను రీక్రియేట్ చేయనుంది.

మొత్తంగా, సెప్టెంబర్‌లో తెలుగు సినిమాలు రికార్డులు బద్దలు కొట్టాయి. అక్టోబర్‌లోనూ అదే జోష్‌తో బాక్సాఫీస్ సందడి కొనసాగనుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top