Ginger garlic Paste:నెలల తరబడి తాజాగా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఈ సులభమైన ట్రిక్‌తో ఇంట్లోనే తయారు చేసుకోండి

Ginger Garlic Paste
Ginger garlic Paste:నెలల తరబడి తాజాగా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఈ సులభమైన ట్రిక్‌తో ఇంట్లోనే తయారు చేసుకోండి..భారతీయ వంటగదుల్లో అల్లం మరియు వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ రెండింటితో తయారైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటకాలకు రుచి, సుగంధాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఔషధంలా పనిచేస్తుంది. దీని ఘాటైన వాసన మరియు కారమైన రుచి కూరలు, బిర్యానీలు, మాంసాహార వంటకాలకు ప్రత్యేకమైన రుచిని జోడిస్తాయి.

మార్కెట్‌లో రెడీమేడ్ పేస్ట్‌లు లభ్యమైనప్పటికీ, ఇంట్లో స్వచ్ఛంగా, తాజాగా తయారు చేసిన పేస్ట్ రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాలు అసమానమైనవి. ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లు విస్తృతంగా అమ్మకానికి ఉన్నాయి. 

కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో అధికారులు కల్తీ పదార్థాలతో తయారైన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను పెద్ద ఎత్తున గుర్తించారు. అందుకే, రసాయనాలు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా, నెలల తరబడి నిల్వ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఇంట్లో ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
అల్లం
వెల్లుల్లి
కల్లు ఉప్పు
పసుపు
నూనె

తయారీ విధానం
ముందుగా 100 గ్రాముల అల్లం తీసుకొని, ఒక ప్లేట్ లేదా గిన్నెలో వేసి నీటితో కనీసం 4-5 సార్లు శుభ్రంగా కడగాలి. మట్టి లేదా ధూళి అస్సలు ఉండకూడదు. కడిగిన అల్లంను పొడి గుడ్డ లేదా క్లాత్‌పై వేసి తడి పూర్తిగా తొలగేలా తుడవాలి. తడి మిగిలి ఉంటే, 10 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరనివ్వండి.

తర్వాత అల్లంను చిన్న ముక్కలుగా కోయండి.100 గ్రాముల వెల్లుల్లి తీసుకోండి (పొట్టు తీసేయాలా లేక ఉంచాలా అనేది మీ ఇష్టం). అల్లం మరియు వెల్లుల్లి రెండూ పూర్తిగా తడి లేకుండా ఉండేలా చూసుకోవడం ముఖ్యం.

మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. ఆ తర్వాత ఇందులో 1 టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్‌ల కల్లు ఉప్పు, 6 టీస్పూన్‌ల నూనె వేసి మళ్లీ గ్రైండ్ చేయండి. పేస్ట్ మెత్తగా, సమానంగా ఉండేలా చూసుకోండి.

గ్రైండ్ చేసిన పేస్ట్‌ను గాజు సీసాలో నింపండి. పేస్ట్ పైన 1 టేబుల్ స్పూన్ నూనె పోయండి. ఇది గాలితో సంబంధం లేకుండా చేసి, పేస్ట్ రంగు మారకుండా, తాజాగా ఉండేలా చేస్తుంది.
సీసా మూతను గట్టిగా బిగించి, ఫ్రిజ్‌లో నిల్వ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కనీసం 2 నెలలపాటు తాజాగా ఉంటుంది.

గమనిక: పేస్ట్ తీసేటప్పుడు ఎల్లప్పుడూ పొడి స్పూన్‌ను మాత్రమే ఉపయోగించండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top