Kitchen Hacks:ఈ టిప్ తెలిస్తే, ఎండిపోయిన నిమ్మకాయలను ఎప్పటికీ పారేయరు.. చాలా మంది ఎండిపోయిన నిమ్మకాయలను వృథాగా పడేస్తుంటారు. కానీ, వీటిని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలిస్తే... ఇకపై మీరు వాటిని ఎప్పుడూ వేస్ట్ చేయరు.
నిమ్మకాయలు మన రోజువారీ జీవితంలో తప్పనిసరి. కానీ, తాజాగా ఉన్నంతవరకే వాడతాం. ఎండిపోతే పనికిరానివిగా భావిస్తాం. అయితే, పారేయడానికి బదులు కిచెన్ శుభ్రత నుంచి షూ క్లీనింగ్ వరకు అనేక పనుల్లో ఉపయోగపడతాయి. ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం...
సింక్, పాత్రల శుభ్రతకు సహజ క్లీనర్... ఎండిన నిమ్మకాయ చెక్కపై ఉప్పు చల్లి, స్టీల్ లేదా రాగి పాత్రలను బాగా రుద్దండి. మొండి మరకలు సులువుగా పోతాయి. స్టీల్ పాత్రలు కొత్తవి లాగా మెరుస్తాయి. అదే విధంగా కిచెన్ సింక్‌ను కూడా శుభ్రం చేయవచ్చు. ఏ మరక అయినా తొలగిపోతుంది, దుర్వాసన కూడా రాదు.
జుట్టు సంరక్షణకు నిమ్మ పొడి... ఎండిన నిమ్మకాయలను పొడి చేసి పౌడర్‌గా తయారు చేసుకోండి. దీనికి కలబంద జెల్ కలిపి హెయిర్ ప్యాక్‌లా జుట్టుకు అప్లై చేయండి. జుట్టు మెరిసిపోతుంది, చుండ్రు సమస్య తగ్గుతుంది.
షూ దుర్వాసన తొలగించడానికి... ఎండిన నిమ్మకాయలను చిన్న ముక్కలుగా కోసి, కాటన్ గుడ్డలో కట్టి షూ ర్యాక్‌లో పెట్టండి. తేమ, దుర్వాసన రెండూ గ్రహిస్తుంది. షూలు ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటాయి.
సహజ ఎయిర్ ఫ్రెషనర్‌గా... గ్యాస్ స్టవ్ లేదా మైక్రోవేవ్‌లో ఎండిన నిమ్మకాయను కాసేపు వేడి చేయండి. వంటగది నుంచి దుర్వాసనలు పోయి, రిఫ్రెషింగ్ నిమ్మ సుగంధం వ్యాపిస్తుంది. లేదా... మెష్ బ్యాగ్‌లో దాల్చిన చెక్క, కర్పూరం, లవంగాలతో పాటు ఎండిన నిమ్మ ముక్కలు వేసి బాత్‌రూమ్ లేదా వార్డ్‌రోబ్‌లో పెట్టండి. సహజ సువాసనలు నిండిపోతాయి.
కీటకాలు, చీమలను దూరంగా ఉంచడానికి... నిమ్మకాయ వాసన కీటకాలకు ఇష్టం ఉండదు. తలుపుల దగ్గర, వంటగది మూలల్లో ఎండిన నిమ్మకాయలు పెట్టండి – ఇంట్లోకి రావు.. ఇకపై ఎండిపోయిన నిమ్మకాయలు వేస్ట్ కాదు... స్మార్ట్ హ్యాక్!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


