Ghee Coffee benefits:కాఫీలో నెయ్యి కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! ఇక దీన్ని వదిలిపెట్టరు! ఉదయం ఒక కప్పు కాఫీలో నెయ్యి కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు, సినీ తారలు సైతం చెప్పారు. దీన్ని 'బులెట్ కాఫీ' అని పిలుస్తారు. ఈ పానీయం జీవక్రియను మెరుగుపరచడమే కాక, రోజంతా చురుకుగా ఉండేందుకు అవసరమైన శక్తిని అందిస్తుందని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యం, అందం కోసం ఈ బులెట్ కాఫీ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.
నెయ్యిలో విటమిన్లు ఎ, ఇ ఉంటాయి, ఇవి కాఫీతో కలిస్తే రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ పేగు ఆరోగ్యాన్ని పోషిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే నెయ్యి కలిపిన కాఫీ ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు.
కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, నెయ్యిలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ రెండూ కలిస్తే ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉదయం నెయ్యి కలిపిన కాఫీ తాగితే శరీరానికి పోషకాలు అందడంతో పాటు బరువు తగ్గడం వంటి అనేక లాభాలు ఉన్నాయి.
కాఫీలో నెయ్యి కలిపి తాగడం వల్ల జ్ఞాపకశక్తి, దృష్టి శక్తి మెరుగవుతాయి. నెయ్యి భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ నెయ్యిని ఆహారంలో తీసుకుంటారు. నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు జీర్ణక్రియను ఉత్తేజపరిచి, శక్తిని అందిస్తాయి. నెయ్యి కాఫీ పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షిస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. దేశీ నెయ్యిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన బరువు తగ్గడంలో, మెదడు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి.
బ్లాక్ కాఫీ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రోజూ ఒక గ్లాసు నెయ్యి కాఫీ తాగితే శరీరానికి నిరంతర శక్తి లభిస్తుంది, అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


