Milk: పాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తాగడం మంచిదేనా? దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా.. పాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి మరియు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అయితే, పాలను పదే పదే వేడి చేసి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాలను ఎక్కువ సార్లు వేడి చేయడం సరైంది కాదు?
చాలా గృహాల్లో పిల్లలు, పెద్దలు రోజూ పాలను తాగుతుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలున్న ఇళ్లలో ఎప్పుడూ పాలు అందుబాటులో ఉంటాయి. ప్యాకెట్ పాలు లేదా ఆవు పాలను అవసరాన్ని బట్టి తెచ్చుకుంటారు. ఇంట్లో ఎప్పుడూ పాలు ఉండటంతో, అవసరమైనప్పుడల్లా వాటిని వేడి చేసి తాగుతారు, ఆ తర్వాత మిగిలిన పాలను ఫ్రిజ్‌లో ఉంచుతారు.
పాలను పదే పదే వేడి చేయడం సరైనదేనా?
పాలను పదే పదే వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు సూచిస్తున్నారు. కొందరు పాలు పాడవకుండా ఉండేందుకు వేడి చేస్తామని అంటారు. కానీ, పాలను బాగా వేడి చేయడం లేదా పదే పదే మరిగించడం మంచిది కాదు.
పదే పదే వేడి చేసిన పాల వల్ల కలిగే సమస్యలు
పాలను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల అందులో హానికరమైన రసాయనాలు ఏర్పడతాయి. ఇవి రక్తనాళాలను గట్టిపరచడం ద్వారా ఎర్ర రక్త కణాల స్థితిస్థాపకతను దెబ్బతీస్తాయి. ఫలితంగా, రక్త ప్రసరణ సరిగా జరగదు, రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి కాలేయ వాపు లేదా గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు.
పాలను పదే పదే వేడి చేసి తాగితే ఏమవుతుంది?
పాలను ఎక్కువసార్లు వేడి చేసి, చల్లార్చి తాగడం వల్ల వాటిలోని పోషకాలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. పాలలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, విటమిన్ బి, విటమిన్ డి వంటి పోషకాలు నష్టపోతాయి. అలాంటి పాలను తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనం కలగదు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.