Lemon Grass:నిమ్మగడ్డితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..! కనిపిస్తే తప్పక తెచ్చుకుని వాడండి..!

Lemon grass
Lemon Grass:నిమ్మగడ్డితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..! కనిపిస్తే తప్పక తెచ్చుకుని వాడండి..నిమ్మకాయల గురించి అందరికీ తెలిసిందే. నిమ్మకాయల నుంచి వచ్చే రసాన్ని మనం వంటల్లో ఉపయోగిస్తాం లేదా పానీయాల్లో కలిపి తాగుతాం. కొందరు నిమ్మరసాన్ని నేరుగా నోట్లో పిండి తాగుతారు కూడా. అయితే, నిమ్మగడ్డి అనే పదం కూడా మనకు తరచూ వినిపిస్తుంది. చాలా మంది దీని గురించి వినే ఉంటారు. 

ఇది ఉల్లికాడలాగా కనిపిస్తుంది, కానీ నిమ్మకాయల వాసనను వెదజల్లుతుంది. అందుకే దీన్ని నిమ్మగడ్డి అని పిలుస్తారు. నిమ్మకాయలతో దీనికి ఎటువంటి సంబంధం లేకపోయినా, నిమ్మగడ్డిలో నిమ్మ గుణాలు ఉంటాయి. ఈ గడ్డి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుతం మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో నిమ్మగడ్డిని పండిస్తున్నారు. దీన్ని ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం, నిమ్మగడ్డిని ఉపయోగించడం ద్వారా అనేక లాభాలు పొందవచ్చు.

జీర్ణ వ్యవస్థకు ఉపయోగం నిమ్మగడ్డి ఆకులను శుభ్రంగా కడిగి, నీటిలో వేసి మరిగించి, ఆ నీటిని రోజుకు ఒక కప్పు మోతాదులో ఉదయం లేదా సాయంత్రం తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నిమ్మగడ్డి టీని సంప్రదాయ వైద్య విధానాల్లో ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ టీ సేవించడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. 

గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది, జీర్ణ వ్యవస్థలో అసౌకర్యం తొలగిపోతుంది. నిమ్మగడ్డిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

వాపులు, నొప్పులకు ఉపశమనం నిమ్మగడ్డిలో యాంటీ-ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి, దీని టీ తాగడం వల్ల శరీరంలో వాపులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిమ్మగడ్డిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది, హై బీపీ ఉన్నవారికి ఈ టీ ఎంతో ఉపయోగకరం. 

ఈ టీలో డైయూరెటిక్ గుణాలు కూడా ఉన్నాయి, దీని వల్ల శరీరంలో అదనపు ద్రవాలు బయటకు పోతాయి. ఫలితంగా కిడ్నీలపై ఒత్తిడి తగ్గుతుంది, పాదాలు, చేతుల్లో వాపులు తగ్గిపోతాయి. యాంటీ-ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, దీని వల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.

సీజనల్ వ్యాధులకు చెక్ నిమ్మగడ్డి టీ తాగడం వల్ల దగ్గు, జలుబు, జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్, గొంతు నొప్పి, మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు దిబ్బడ నుంచి కూడా బయటపడవచ్చు. నిమ్మగడ్డి సహజ డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. దీని టీ తాగితే శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. 

ముఖ్యంగా లివర్, కిడ్నీల్లోని వ్యర్థ పదార్థాలు తొలగిపోయి, ఈ అవయవాలు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటాయి. నిమ్మగడ్డి ఆకుల పేస్ట్‌ను ఫేస్ ప్యాక్‌గా ఉపయోగిస్తే ముఖంపై ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గి, ముఖం కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది.

ఇలా నిమ్మగడ్డితో ఎన్నో లాభాలు పొందవచ్చు. కాబట్టి, మార్కెట్‌లో నిమ్మగడ్డి కనిపిస్తే తప్పక తెచ్చుకుని ఉపయోగించండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top