Sweetcorn appalu:ఈ చల్లటి క్లైమేట్ లో వేడి వేడి స్వీట్ కార్న్ అప్పాలు తింటే ఆ మజాయే వేరు.. స్వీట్ కార్న్ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. స్వీట్ కార్న్ అప్పాలు ఎలా తయారుచేయాలో చుడం.
పదార్థాలు:
- స్వీట్‌కార్న్ గింజలు: పావు కిలో
- శనగపిండి: 2 టేబుల్ స్పూన్లు
- బియ్యప్పిండి: 1 టేబుల్ స్పూను
- అల్లం: 1 అంగుళం ముక్క
- పచ్చిమిరపకాయలు: 4
- కొత్తిమీర: 4 రెబ్బలు
- ఉల్లిపాయ: 1
- ఉప్పు: తగినంత
తయారీ విధానం:
- స్వీట్‌కార్న్ గింజలలో మూడు వంతులు తీసుకొని మిక్సీలో లేదా రోట్లో కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
- రుబ్బిన పిండిలో మిగిలిన స్వీట్‌కార్న్ గింజలను కలిపి పక్కన పెట్టుకోవాలి.
- అల్లం ముక్కను తురుముకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొత్తిమీరను సన్నగా తరిగి ఉంచాలి.
- రుబ్బిన స్వీట్‌కార్న్ పిండిలో శనగపిండి, బియ్యప్పిండి, తరిగిన కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము వేసి, తగినంత ఉప్పు జోడించాలి.
- అన్ని పదార్థాలు సమానంగా కలిసేలా పిండిని బాగా కలపాలి.
- అప్పం పెనం తీసుకొని, దాని గుంటలలో 4 చుక్కల నూనె చల్లి, పిండిని వేసి రెండు వైపులా కాల్చాలి.
- నూనె తక్కువగా వాడి, రుచికరమైన స్వీట్‌కార్న్ స్నాక్ తయారు చేయాలనుకుంటే ఈ అప్పం గొప్ప ఎంపిక!