Seeds Benefits:ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ విత్తనాలను గుప్పెడు మోతాదులో తినండి..మనం ఆరోగ్యంగా ఉండాలంటే, అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారాన్ని రోజూ తీసుకోవాలని అందరికీ తెలుసు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది, పోషకాహార లోపాలు తగ్గుతాయి, అనేక వ్యాధులను నివారించవచ్చు. పౌష్టికాహారంలో విత్తనాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
అనేక రకాల విత్తనాలు మనకు అందుబాటులో ఉన్నాయి, వీటిని రోజూ తీసుకోవడం వల్ల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాక, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుక, పోషకాహార నిపుణులు రోజూ విత్తనాలను తినాలని సిఫారసు చేస్తున్నారు.
అవిసె గింజలు, చియా సీడ్స్ మనకు అందుబాటులో ఉన్న విత్తనాల్లో అవిసె గింజలు ఒకటి. ఇవి ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, పాలిఫినాల్స్‌తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి, తద్వారా తక్కువ ఆహారం తీసుకోవడానికి సహాయపడతాయి, బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. రోజూ గుప్పెడు అవిసె గింజలను నీటిలో నానబెట్టి లేదా తేలికగా వేయించి సాయంత్రం స్నాక్స్‌గా తినవచ్చు.
ఇవి రక్తపోటును తగ్గిస్తాయి, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి, హార్ట్ ఎటాక్‌ను నివారిస్తాయి. అదేవిధంగా, చియా సీడ్స్ కూడా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, పాలిఫినాల్స్‌ను అందిస్తాయి. చియా సీడ్స్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, సీజనల్ వ్యాధులు తగ్గుతాయి, శరీరంలో వాపు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది, డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు నువ్వులు కూడా ఎంతో ఆరోగ్యకరం. ఇవి ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్‌ను సమృద్ధిగా అందిస్తాయి. నువ్వులు తినడం వల్ల క్యాల్షియం లభించి ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
మహిళల్లో హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. వ్యాయామం చేసేవారు నువ్వులు తింటే కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే, పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ గుప్పెడు మోతాదులో నానబెట్టి లేదా వేయించి సాయంత్రం స్నాక్స్‌గా తినవచ్చు. ఇవి కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి, విటమిన్ ఇని అందిస్తాయి, క్యాన్సర్‌ను నివారిస్తాయి, కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రిస్తాయి, గర్భిణీలకు మేలు చేస్తాయి.
గుమ్మడికాయ విత్తనాలు గుమ్మడికాయ విత్తనాలు రోజూ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇవి వివిధ రకాల మినరల్స్‌తో సమృద్ధమై ఉంటాయి. ఇందులోని మెగ్నీషియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది, ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని పెంచుతుంది. బద్దకం తగ్గుతుంది, డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది, నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఇందులో జింక్ అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఈ విత్తనాలన్నింటినీ కలిపి రోజుకు ఒక గుప్పెడు మోతాదులో తినవచ్చు. నీటిలో నానబెట్టి తింటే జీర్ణం సులభమవడమే కాక, పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. ఈ విధంగా విత్తనాలను రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.