Business Ideas:నెలకు ₹1 లక్ష సంపాదన మీ టార్గెటా? కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే.. ఈ హై డిమాండ్ బిజినెస్‌ను ట్రై చేయండి.. పట్టణ ప్రజలు తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. దీంతో స్పా, సెలూన్, మసాజ్ పార్లర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఒత్తిడి పెరగడంతో ప్రజలు విశ్రాంతి కోసం ‘స్పా’కి వెళ్తున్నారు.
ఈ వ్యాపారంలో ఫేషియల్స్, అరోమాథెరపీ, మసాజ్, మానిక్యూర్, పెడిక్యూర్, హైడ్రోథెరపీ వంటి అనేక సేవలు ఉన్నాయి. బడ్జెట్ పరిమితంగా ఉంటే కూడా ఈ బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. ‘స్పా’ అంటే బాడీ మసాజ్, అరోమాథెరపీ, స్టీమ్ బాత్, ఫుట్ మసాజ్, ఫేషియల్స్ వంటి సేవలు అందించే వెల్నెస్ సెంటర్. ఇవి అందం పెంచడమే కాక, శారీరక అలసట తగ్గించడం, రక్త ప్రసరణ మెరుగుపరచడం, మానసిక ఒత్తిడి తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంటాయి.
ఈ బిజినెస్ కోసం సరైన లొకేషన్ ఎంచుకోవడం కీలకం. వాణిజ్య ప్రాంతం, జిమ్, యోగా సెంటర్ లేదా బ్యూటీ సెలూన్ సమీపంలో స్పా ప్రారంభించవచ్చు.
పెట్టుబడి విషయానికొస్తే.. చిన్న స్థాయి స్పా ప్రారంభానికి రూ.1.2 లక్షల నుండి రూ.3.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మిడ్-రేంజ్ స్పా రూ.4 లక్షల నుండి 10 లక్షల వరకు, ప్రీమియం స్పా రూ.15 లక్షల నుండి 45 లక్షల వరకు ఖర్చు పెట్టాలి. ఇందులో అద్దె, ఇంటీరియర్స్, బెడ్లు, టవల్స్, మసాజ్ ఆయిల్స్, సిబ్బంది జీతాలు, పెర్ఫ్యూమ్స్, లైటింగ్ వరకు అన్నీ ఉంటాయి.
చిన్న పట్టణాల్లో మసాజ్ ధర సగటున రూ.500 నుండి 1,000 వరకు ఉంటుంది. పెద్ద నగరాల్లో రూ.1,200 నుండి 2,800 వరకు ఉంటుంది. రోజుకు కేవలం 8 మంది కస్టమర్లు వచ్చినా, ఒక్కొక్కరి నుండి సగటున రూ.2,000 సంపాదించవచ్చు.
ఇది నెలకు దాదాపు రూ.4 లక్షల టర్నోవర్‌గా మారుతుంది. అన్ని ఖర్చులు తీసేసినా నెలకు రూ.80,000 నుండి రూ.1.2 లక్షల వరకు నికర లాభం వస్తుంది. పెద్ద స్పాల్లో లాభాలు రూ.2 లక్షల నుండి 6 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు.
స్పా నడపడానికి ట్రేడ్ లైసెన్స్, GST రిజిస్ట్రేషన్, అవసరమైతే ఫైర్ సేఫ్టీ NOC తప్పనిసరి. సిబ్బంది పోలీసు వెరిఫికేషన్ కూడా అనివార్యం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


