Pottu Minapappu:పొట్టు మినపప్పును పక్కన పెట్టేస్తున్నారా.. తింటే పుట్టెడు లాభాలు..

Pottu Minapappu
Pottu Minapappu:పొట్టు మినపప్పును పక్కన పెట్టేస్తున్నారా.. తింటే పుట్టెడు లాభాలు.. పొట్టు మినపప్పు అంటే గింజకు తొక్కు తీయకుండా ఉంచిన మినపప్పు. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

బి-విటమిన్లు, ఇతర ఖనిజాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడతాయి. అధిక ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, హృదయ వ్యాధుల నివారణకు దోహదపడుతుంది.

మినపప్పు పోషకాల గని. ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రుచికరమైన వంటకాలతోపాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ మినపప్పు వంటకాలు తీసుకుంటే మేలు. పొట్టు మినపప్పు మలబద్ధకం, అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఫైబర్, ప్రోటీన్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలను బలోపేతం చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఉత్తమం. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది – సన్ టాన్, మొటిమలు, చర్మ సమస్యలు తగ్గుతాయి. జుట్టు సంరక్షణకూ ఉపయోగపడుతుంది.

పొట్టు మినపప్పు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. కండరాల అభివృద్ధికి, జీర్ణశక్తికి ఫైబర్ సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేస్తుంది, పేగుల నుంచి వ్యర్థాలు సులువుగా బయటకు వెళ్తాయి. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. కాల్షియం, మెగ్నీషియం ఎముకలను బలపరుస్తాయి. బి-విటమిన్లు, ఐరన్ రక్తహీనతను తగ్గిస్తాయి. గర్భిణులకూ ఎంతో మేలు చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top