Uric Acid:ఈ 3 పండ్లు రోజూ తింటే.. మీ శరీరంలో యూరిక్ యాసిడ్ చిటికెలో తగ్గిపోతుంది..ఆఫీసు లంచ్ అయినా, స్నేహితులతో కేఫీలలోనో, రోడ్డు పక్కన స్టాల్స్‌లోనో.. ఎక్కడున్నా వేడి వేడి పరాఠాలు, సమోసాలు, వివిధ స్ట్రీట్ ఫుడ్స్‌ను ఆరగిస్తుంటారు చాలా మంది. ఇది ఫాస్ట్ ఫుడ్ అలవాటుగా మారి, శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. మొదట్లో ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తారు.
ఇది కూడా చదవండి:గ్యాస్ బర్నర్‌లు మురికిగా ఉన్నాయా? ఈ సింపుల్ టిప్స్‌తో కొత్తవి లాగా మెరిసిపోతాయ్!
ఫలితంగా అరికాళ్లు, మోకాళ్లు, మోచేతుల్లో నొప్పులు మొదలవుతాయి. ఎక్కువసేపు కూర్చుంటే పాదాలు ఉబ్బుతాయి. ఇక్కడి నుంచే ఆర్థరైటిస్ కూడా ప్రారంభమవుతుంది. యూరిక్ యాసిడ్‌ను ముందుగానే అరికట్టగలిగితే, భవిష్యత్ సమస్యలను పూర్తిగా నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. లేకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. మొదట నొప్పిగా మొదలైనా, యూరిక్ యాసిడ్ మూత్రపిండాలు, గుండెపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
యూరిక్ యాసిడ్ లక్షణాలు కనిపించగానే ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరి. పాలకూర, టమాటాలు, పప్పులు, మాంసాహారం, చేపల నూనె, కాఫీ, కేకులు వంటివి పూర్తిగా మానేయాలి. కానీ మూడు రకాల పండ్లు మాత్రం తప్పకుండా తినాలి. ఇవి క్రమం తప్పకుండా తీసుకుంటే మ్యాజిక్‌లా పనిచేసి, యూరిక్ యాసిడ్‌ను వేగంగా తగ్గిస్తాయి.
ఇది కూడా చదవండి:ఈ ఆకుపచ్చ కూరగాయ డయాబెటిస్ కి దివ్యౌషధం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
చెర్రీస్
చెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర నొప్పులను తగ్గించడమే కాక, యూరిక్ యాసిడ్ స్థాయిలను కూడా సమర్థవంతంగా తగ్గిస్తాయి.
నిమ్మకాయ
విటమిన్ సి యూరిక్ యాసిడ్‌కు పెద్ద శత్రువు. శరీరంలో విటమిన్ సి స్థాయి పెరిగితే యూరిక్ యాసిడ్ మ్యాజిక్‌లా తగ్గిపోతుంది. కాబట్టి నిమ్మకాయ, నారింజలను రోజూ తీసుకోవడం వల్ల ఈ సమస్య త్వరగా అదుపులోకి వస్తుంది.
ఆపిల్స్
విటమిన్ సి మాత్రమే కాదు, విటమిన్ ఎ కూడా యూరిక్ యాసిడ్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఆపిల్స్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ ఒక ఆపిల్ తింటే యూరిక్ యాసిడ్ దూరంగా ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


