Cooking Tips:కాలీఫ్లవర్‌లోని పురుగులను సులభంగా ఇలా తొలగించండి..కాలీఫ్లవర్ అంటే ఇష్టమున్నా, చాలామంది దీన్ని చూడగానే భయపడతారు. కారణం? ఇందులో పురుగులు ఎక్కువగా ఉండటం. అయితే, ఈ పురుగులను సింపుల్‌గా తొలగించి, దీనితో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది కాలీఫ్లవర్ కొన్న వెంటనే ముక్కలు చేసి, మరుగుతున్న నీటిలో వేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్ మెత్తబడి, రుచి కోల్పోతుంది. మరి పురుగులను ఎలా తొలగించాలి?
కాలీఫ్లవర్ కొనేటప్పుడు పసుపు రంగు లేకుండా, తెల్లగా, కొద్దిగా మాత్రమే విచ్చుకున్నది ఎంచుకోండి. ఇలాంటివి పురుగులు తక్కువగా ఉంటాయి. కొన్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసి, ప్రతి ముక్క వేరుగా ఉండేలా చూసుకోండి.
తర్వాత గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు, ఉప్పు కలిపి, కాలీఫ్లవర్ ముక్కలు వేసి 20 నిమిషాలు నానబెట్టండి.
ఆ తర్వాత స్ట్రైనర్‌లోకి తీసి, మూడు సార్లు శుభ్రంగా కడిగేయండి. ఇలా చేయడం వల్ల ఉప్పు, పసుపు మరకలు, చిన్న పురుగులు, చనిపోయిన పురుగులు అన్నీ పోతాయి.
చివరిగా, మళ్లీ గోరువెచ్చని నీటిలో పసుపు, ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి, 2 నిమిషాలు ఉంచండి. ఇలా చేస్తే కీటకాలు పూర్తిగా నశిస్తాయి. ఇప్పుడు కాలీఫ్లవర్‌ను వంట చేసుకోవచ్చు!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


