Curd Chutney recipe:ఇడ్లీ, దోసెలతో అదిరిపోయే కాంబో.. కర్ణాటక స్టైల్ పెరుగు చట్నీ..సూపర్ టేస్టీ.. ఉదయాన్నే ఇడ్లీ లేదా దోసె అనగానే మనసు ఆనందంగా ఉంటుంది కానీ… పక్కన పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీ మాత్రమే వస్తే కాస్త బోర్ కొట్టేస్తుంది కదా!
అలాంటి వాళ్ల కోసం ఈ రోజు తెచ్చాను – కర్ణాటకలో చాలా ఫేమస్, సూపర్ క్రీమీ & కమ్మని పెరుగు చట్నీ.. నువ్వులు + ధనియాలు + చిక్కటి పెరుగు కలిసిన ఈ చట్నీ రుచి చూస్తే… “ఇకపై ఇదొక్కటే కావాలి!” అనిపిస్తుంది. చూడటానికి కారం చట్నీలా ఉన్నా, తిన్నాక మాత్రం నోరూరుతుంది!
⇒ ఒక్కసారి ఇంట్లో ట్రై చేస్తే, ఇక నుంచి ఇడ్లీ-దోసె అంటే కాదు… అన్నంలో కలిపి కూడా తినిపిస్తారు
ALSO READ:రోజూ ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? శాస్త్రీయంగా చూస్తే ఏమిటి?కావలసిన పదార్థాలు (4-5 మందికి సరిపడా)
ఎండు మిర్చి - 5
మినపప్పు - 2 టీస్పూన్
ధనియాలు - 2 టీస్పూన్
నువ్వులు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఆవాలు - ½ + ½ టీస్పూన్ (రోస్టింగ్ + తాలింపు కోసం)
వెల్లుల్లి రెబ్బలు - 3-4
చిన్న ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన)
చిక్కటి పుల్లని పెరుగు - ½ కప్పు (లేదా అవసరానికి ఇంకా కాస్త)
కొత్తిమీర - కొద్దిగా
నూనె - 1 + 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
ఉప్పు - సరిపడా
తయారు చేసే విధానం (సూపర్ ఈజీ – 15 నిమిషాల్లో రెడీ!)
కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేయండి. ఎండు మిర్చి వేసి దోరగా వేయించి పక్కన పెట్టండి.అదే కడాయిలోనే మినపప్పు + ధనియాలు వేసి ఎర్రగా వచ్చే వరకు వేయించండి (సుగంధం ఘుమఘుమలాడుతుంది).
ఇప్పుడు నువ్వులు + జీలకర్ర + ½ టీస్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడే వరకు వేయించండి. చివరగా తరిగిన ఉల్లిపాయ + వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వండి.
స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి.
ALSO READ:తలపై చుండ్రు బాధపెడుతోందా? ఈ సింపుల్ ఇంటి చిట్కాలతో పూర్తిగా మాయం చేయండి..
చల్లారాక మిక్సీ జార్‌లో వేసి ముందు ఉప్పు కలిపి మెత్తని పొడిగా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత పుల్లని పెరుగు వేసి మరోసారి స్మూత్‌గా గ్రైండ్ చేసుకోండి. (కావాలంటే కాస్త నీళ్లు కూడా పోసుకోవచ్చు – కానీ పల్చటి కాకుండా చూసుకోండి)
ఒక గిన్నెలోకి తీసుకొని… తాలింపు వేయాలనిపిస్తే: చిన్న మూకుడులో 1 టీస్పూన్ నూనె వేడి చేసి, ½ టీస్పూన్ ఆవాలు + కరివేపాకు వేసి చిటపటలాడాక చట్నీలో కలపండి. (తాలింపు లేకున్నా సూపర్ టేస్టే!).. చివరగా పైన కొత్తిమీర చల్లెస్తే… అబ్బో ఘుమఘుమ!!
వేడి వేడి మెత్తని ఇడ్లీలు, క్రిస్పీ దోసెలు, ఊతప్పం… ఏదైనా ఈ చట్నీతో పెడితే ప్లేట్ ఖాళీ అవ్వడం ఖాయం! అన్నంలో కలిపి తింటే కూడా అద్భుతం.


