Custard Apple:చలికాలంలో రోజూ ఒక సీతాఫలం తింటే ఏమి జరుగుతుందో తెలుసా.. సీతాఫలాన్ని రెగ్యులర్‌గా తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా, దీన్ని సరైన విధానంలో తీసుకుంటే సులభంగా బరువు కూడా తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
సీతాఫలం – చలికాలం స్పెషల్ చలికాలం మొదలైందంటే సీతాఫలం సీజన్ వచ్చినట్లే! మార్కెట్లో రుచికరమైన సీతాఫలాలు సులభంగా లభిస్తున్నాయి. ఈ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. సహజ ఫైబర్ పుష్కలంగా, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన సీతాఫలం తింటే కడుపు నిండుగా అనిపిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఆరోగ్యకరమైన మెటబాలిజానికి మద్దతు ఇస్తుంది. రోజుకు కనీసం ఒక సీతాఫలం తినడం వల్ల శరీరంలో ఏ మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం...
ఆకలిని అదుపులో ఉంచే ఫైబర్ సీతాఫలంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. చిరుతిండ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. కేలరీలు చాలా తక్కువగా ఉండటంతో బరువు తగ్గడం సులభమవుతుంది.
ఇది కూడా చదవండి:చలికాలంలో సూపర్ ఫుడ్.. వయసు పెరిగినా నొప్పులు రావు.పోషకాల ఖజానా సీతాఫలం తియ్యగా ఉండటమే కాదు, విటమిన్ సి, బీ కాంప్లెక్స్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. మితంగా తింటే బరువు సులభంగా నియంత్రణలో ఉంటుంది.
మెటబాలిజానికి సహజ బూస్ట్ పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు మెటబాలిక్ రేటును సమతుల్యం చేస్తాయి. కండరాల పనితీరు మెరుగుపడుతుంది, కొవ్వు బర్న్ ప్రక్రియ వేగవంతమవుతుంది. సీతాఫలం శరీరానికి శక్తిని అందిస్తుంది.
అన్‌హెల్దీ స్నాక్స్‌కు బెటర్ ఆప్షన్ హై గ్లైసెమిక్ ఆహారాలకు బదులు సీతాఫలం తీసుకోవడం ఉత్తమం. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి, ఆకలి అదుపులో ఉంటుంది. మొత్తం కేలరీలు తగ్గి, పొట్ట చుట్టూ కొవ్వు నిల్వ తగ్గుతుంది.
పేగు ఆరోగ్యానికి సపోర్ట్ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది, తృప్తి ఎక్కువసేపు ఉంటుంది. అతిగా తినకుండా బరువు నియంత్రణ సాధ్యమవుతుంది.
యాంటీఆక్సిడెంట్స్ మ్యాజిక్ యాంటీఆక్సిడెంట్లు, ప్లాంట్ కాంపౌండ్స్ వాపును తగ్గిస్తాయి. కొవ్వు నిల్వ తగ్గుతుంది, చర్మం మెరుపు పొందుతుంది.
సహజ చక్కెరలు ప్రాసెస్డ్ స్వీట్స్‌తో పోల్చితే, సీతాఫలంలోని చక్కెరలు ఫైబర్, పోషకాలతో కలిసి ఉంటాయి. రక్త చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు, ఆకలి నియంత్రణలో సహాయపడతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


