Mosquitoes:ఈ విధంగా దీపం వెలిగిస్తే ఇంట్లో దోమలు ఒక్కసారిగా పరార్!.. ఖచ్చితంగా ట్రై చేయండి..దోమలను తరిమికొట్టడానికి రసాయన ఉత్పత్తులు అవసరం లేకుండా.. మన వంటగదిలోని సాధారణ పదార్థాలతోనే సులువుగా దోమల బెడద నుండి విముక్తి పొందవచ్చు.
మీరు కూడా ఈ ఇబ్బంది నుండి బయటపడాలనుకుంటున్నారా? అయితే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు చాలు.. పెద్ద ఖర్చు లేకుండానే! ఈ సింపుల్ చిట్కాలు ఏమిటో పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం...
Also read:బిర్యానీ మసాలా జాపత్రితో బంగారు ఆరోగ్యం.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..సీజన్‌తో సంబంధం లేకుండా.. సాయంత్రం దాటగానే దోమలు దండయాత్ర మొదలెడతాయి. రాత్రి ప్రశాంతంగా నిద్రపోనివ్వవు. చెవుల దగ్గర జివ్వుమని, కుడుతూ రక్తం పీల్చేస్తాయి. ఈ బెడదతో బాధపడేవారు మస్కిటో కాయిల్స్, లోషన్లు లేదా వాసన లేని రసాయన ఉత్పత్తులు వాడుతుంటారు.
కానీ, ఏ రసాయన ఉత్పత్తి అయినా కాలక్రమేణా సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. అందుకే రసాయనాలు లేకుండా.. వంటగదిలో లభించే పదార్థాలతో దోమలను సులువుగా తరిమికొట్టవచ్చు. ఇది చవకైనది, సురక్షితమైనది!
ప్రతి ఇంటా ఉండే ఉల్లిపాయ దోమలను తరిమికొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుందని తెలుసా? ఉల్లిపాయల్లోని సల్ఫర్ సమ్మేళనాలు దోమలకు చాలా ఇబ్బందికరం. ఈ వాసన వాటికి తట్టుకోలేనిది. ఇంకా ఉప్పు ఈ వాసనను గాలిలో వ్యాపింపజేసి, దోమలను దూరంగా ఉంచుతుంది.
ఉల్లిపాయ దీపం ఎలా తయారు చేయాలి?
Also Read:ఆలూ కర్రీ ని కుక్కర్ లో10నిమిషాల్లో రుచిగా ఇలా చేయండి.. రైస్ చపాతీ పులావ్ లో సూపర్..రాత్రి నిద్రలో దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నారా? ఈ సింపుల్ హోమ్ రెమిడీ ట్రై చేయండి!
కావలసిన పదార్థాలు:
1 పెద్ద ఉల్లిపాయ
2-3 కర్పూరం ముక్కలు
కొన్ని నల్ల మిరియాలు (పొడి చేసుకోవాలి)
ఆవ నూనె (లేదా ఏదైనా వంట నూనె)
కాటన్ వత్తి (విక్)
తయారీ విధానం:
ఉల్లిపాయ పై భాగాన్ని కత్తితో కోసి తీసేయండి.ఉల్లిపాయను దీపం ఆకారంలో కోసి, మధ్యలో బోలు చేయండి.ఆ బోలులో కర్పూరం ముక్కలు, నల్ల మిరియాల పొడి వేసి నింపండి.ఆవ నూనె పోసి, కాటన్ వత్తిని చొప్పించండి.బెడ్‌రూమ్, హాల్, పిల్లల గది లేదా వంటింటి మూలలో ఉంచి వత్తిని వెలిగించండి.
ఫలితం: కేవలం 1-2 నిమిషాల్లోనే దోమలు వాసన తట్టుకోలేక ఎగిరిపోతాయి లేదా నేలపై పడిపోతాయి!
ఎందుకు పనిచేస్తుంది?
ఉల్లిపాయలోని సల్ఫర్ + కర్పూరం + నల్ల మిరియాలు + ఆవ నూనె కలిసి దోమలు తట్టుకోలేని బలమైన వాసనను విడుదల చేస్తాయి. ఇది 100% సహజం, పిల్లలు, వృద్ధులకు సురక్షితం. రసాయన మందుల ఖర్చు ఆదా, ఆరోగ్యం కాపాడుకోవచ్చు.
శీతాకాలంలోనూ, వర్షాకాలంలోనూ ఈ ఉల్లిపాయ దీపం మీ ఇంటిని దోమల నుండి రక్షిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.. ఫలితం మీకే తెలుస్తుంది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

.webp)
