Doosara Theega:మన చుట్టూ పరిసరాల్లోనే సులభంగా కనిపించే ఈ మొక్కను చూస్తే.. వదలకుండా తెచ్చి వాడండి..మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వాటిలో ఔషధ గుణాలు కలిగినవి చాలానే ఉంటాయి. కానీ చాలా మందికి అలాంటి మొక్కల గురించి తెలియదు. వాటిని చూసి పిచ్చిమొక్కలుగా భావిస్తారు.
అయితే ఆయుర్వేదం ప్రకారం ఆ మొక్కలు అద్భుత ఔషధ విలువలు కలిగి ఉంటాయి. అలాంటి మొక్కల్లో ‘దూసర తీగ’ కూడా ఒకటి. ఇది తీగ జాతికి చెందిన మొక్క. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మన నివాస పరిసరాల్లోనూ బాగా పెరుగుతుంది.
జాగ్రత్తగా చూస్తే సులభంగా గుర్తించవచ్చు. తీగ జాతి కాబట్టి పొదలపై అల్లుకుని పెరుగుతుంది. చేలు, పొలాల గట్లపై ఎక్కువగా దొరుకుతుంది. ఇంట్లోనూ పెంచుకోవచ్చు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది, పలు వ్యాధుల నివారణకు సహాయపడుతుంది.
కంటి, చర్మ సమస్యలకు..
దూసర తీగ ఆకులు అనేక ఆరోగ్య లాభాలను ఇస్తాయి. కళ్ల మంట, దురద, రెప్పలపై కురుపులు వంటి సమస్యలకు ఉపయోగపడతాయి. ఆకులను శుభ్రంగా కడిగి దంచి రసం తీసి, రాత్రిపూట రెప్పలపై రాయండి.
మరుసటి ఉదయం గోరువెచ్చని నీటితో కడగండి. వారం రోజులు ఇలా చేస్తే కంటి సమస్యలు తగ్గుతాయి, కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఆకుల గుజ్జును చర్మంపై రాస్తే దురద, దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు, ఎరుపు, గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు తొలగుతాయి.
అధిక వేడి ఉంటే..
శరీరంలో ఎక్కువ వేడి ఉన్నవారికి ఈ ఆకులు ఉపశమనం కలిగిస్తాయి. ఆకులను దంచి రసం తీసి, గ్లాసులో 5 గంటలు ఉంచితే జెల్ లాగా మారుతుంది. అందులో పటిక బెల్లం కలిపి రెండు రోజులకు ఒకసారి తినండి. శరీర వేడి తగ్గుతుంది, సంబంధిత అనారోగ్యాలు నివారించబడతాయి. ముఖ్యంగా వేసవిలో ఈ చిట్కా ఎంతో ఉపయోగకరం.
డయాబెటిస్, హార్మోన్ల సమస్యలకు..
డయాబెటిస్ ఉన్నవారు గుప్పెడు ఆకులను నీటిలో మరిగించి, వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు రోజుకు రెండుసార్లు (భోజనానికి 30 నిమిషాల ముందు) తాగితే షుగర్ లెవల్స్ తగ్గుతాయి, డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఆకుల రసాన్ని రోజూ అర టీస్పూన్ సేవిస్తే స్త్రీ-పురుషుల హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి, సంతానోత్పత్తి అవకాశాలు మెరుగవుతాయి.
దూసర తీగ ఆకులు అనేక లాభాలను అందిస్తాయి. అయితే అందరికీ సరిపడవు కాబట్టి వైద్యుల సలహాతోనే వాడండి.


