Kitchen Tips:నెల రోజులైనా పచ్చిమిర్చి తాజాగా ఉంచే ట్రిక్ – ఇది పాటిస్తే చాలు..భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటా పచ్చిమిరపకాయలు తప్పనిసరి. పేదైనా, ధనవంతుడైనా అందరి వంటింట్లో ఇవి ఉంటాయి. కూరలకు కారం, పచ్చడికి రుచి, బజ్జీలకు ఆకర్షణ – ఇవన్నీ పచ్చిమిర్చి లేకుండా సాధ్యం కాదు.
మార్కెట్‌లో తాజా మిరపకాయలు కొని వచ్చినా రెండు రోజుల్లోనే మెత్తబడి, బూజు పట్టి, తొడిమల దగ్గర కుళ్లిపోతాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టినా వాసన వచ్చి నిరాశ పరచడం సాధారణం. కానీ కొన్ని సింపుల్ జాగ్రత్తలతో నెల రోజుల వరకు తాజాగా ఉంచవచ్చు. ఎలాగో ఇప్పుడు చూడండి.
పచ్చిమిర్చిని ఎక్కువ కాలం తాజాగా ఉంచే సులువు టిప్స్
1. తొడిమలు తొలగించండి
మిరపకాయలు తొడిమల దగ్గరే ముందు కుళ్లిపోతాయి. మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే తొడిమలను పూర్తిగా తీసేయండి. ఇలా చేయడం వల్ల ఆయుష్షు కనీసం రెండింతలు పెరుగుతుంది.
2. తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టండి
తొడిమలు తీసిన తర్వాత నీటితో బాగా కడిగి, శుభ్రమైన కాటన్ గుడ్డ లేదా పేపర్ టవల్ మీద పరచి గాలికి ఆరనివ్వండి. ఒక్క నీటి బొటుకూడా మిగలకూడదు. అవసరమైతే మెత్తటి గుడ్డతో తుడవండి. తేమ తక్కువగా ఉంటేనే మిరపకాయలు ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి.
3. గాలి చొరబడని డబ్బా
పూర్తిగా ఆరిన మిరపకాయలను గాలి రాని డబ్బాలో నిల్వ చేయండి. డబ్బా అడుగున టిష్యూ పేపర్ లేదా పేపర్ టవల్ వేసి, దానిపై మిరపకాయలు పెట్టండి. పైన మరో పేపర్ వేసి మూత పెట్టండి. ఈ పేపర్ తేమను పీల్చుకుని మిరపకాయలను పొడిగా ఉంచుతుంది. జిప్‌లాక్ బ్యాగ్‌లు కూడా మంచి ఆప్షన్.
4. ఫ్రిడ్జ్‌లో సరైన ప్లేస్‌లో ఉంచండి
డబ్బాను ఫ్రిడ్జ్‌లోని కూరగాయల డ్రాయర్‌లో పెట్టండి. ఇక్కడ తేమ, ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటాయి. ఇది మిరపకాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది.
Also Read:గుండెను ఉక్కులా మార్చే దోశ..! ఒక్కసారి రుచి చూస్తే రోజూ కావాలనిపిస్తుంది..మరచిపోకూడని కీలక టిప్స్
ఏ మిరపకాయ అయినా రంగు మారినా, మెత్తబడినా లేదా కొద్దిగా కుళ్లినట్టు కనిపిస్తే వెంటనే తీసి పడేయండి. ఒక్కటే పాడైతే మొత్తం డబ్బా నాశనమవుతుంది.
ప్రతి 2-3 రోజులకు డబ్బా తెరిచి చెక్ చేయండి. పేపర్ తడిగా ఉంటే మార్చి కొత్త పొడి పేపర్ వేయండి.
ఈ సింపుల్ ట్రిక్‌లతో మీ పచ్చిమిర్చి నెల రోజుల వరకు తాజాగా, గ్రీన్‌గా ఉంటాయి!

.webp)
