Herbal Drinks:ఈ ఐదు సూపర్ డ్రింక్స్ మీ ఆహారంలో చేర్చుకుంటే.. కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలకు సహజ చూమంత్రం.. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె ఆరోగ్యం కాపాడుకోవడానికి జీవనశైలి మార్పులు, వ్యాయామం, మందులు అవసరమే.
కానీ వీటితోపాటు యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, పోషకాలతో నిండిన హెర్బల్ టీలు కూడా అద్భుతంగా సహాయపడతాయి. ఈ టీలు శరీరానికి వెచ్చదనం ఇవ్వడమే కాకుండా, కొలెస్ట్రాల్ నియంత్రణ, రక్తపోటు తగ్గింపు, గుండె ఆరోగ్యానికి బలమైన మద్దతు ఇస్తాయి.
కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఐదు హెర్బల్ టీలు
1. అల్లం టీ అల్లంలో జింజెరాల్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలతో చెడు కొలెస్ట్రాల్‌ను ఎదుర్కొంటాయి. బయోమెడ్ సెంట్రల్ పరిశోధన ప్రకారం, అల్లం వాపును తగ్గిస్తుంది, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.
2. గ్రీన్ టీ గ్రీన్ టీలో కాటెచిన్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. సైన్స్ డైరెక్ట్ పరిశోధనలో రోజుకు 2-3 కప్పులు తాగితే రక్తపోటు, గుండె జబ్బులు తగ్గుతాయని, వాపు తగ్గి బరువు కూడా తగ్గుతుందని తేలింది.
3. మందార టీ గుండెకు సహజ స్నేహితుడు మందార టీ! సైన్స్ డైరెక్ట్ క్లినికల్ ట్రయల్‌లో 65 మంది హై బీపీ రోగులు 6 వారాల పాటు రోజుకు 3 కప్పులు తాగారు. ఫలితం? సిస్టోలిక్ బీపీ గణనీయంగా తగ్గింది. దీని యాంటీఆక్సిడెంట్ గుణాలు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రిస్తాయి.
4. రూయిబోస్ టీ కెఫీన్ లేని, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ టీ అధిక కొలెస్ట్రాల్‌కు సహజ పరిష్కారం. జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇన్ ఆఫ్రికా పరిశోధన ప్రకారం, రోజుకు 200-1200 మి.లీ. తాగితే లిపిడ్ ప్రొఫైల్ మెరుగవుతుంది, గ్లూకోజ్ స్థాయిలు, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతాయి.
5. చమోమైల్ టీ విశ్రాంతి, మంచి నిద్రతోపాటు ఒత్తిడి తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. వయా మెడికా మెటా-అనాలిసిస్ ప్రకారం, దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, ప్లాంట్ స్టెరాల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, లిపిడ్ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి.
ఈ ఐదు టీలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే.. గుండె ఆరోగ్యం మరింత బలోపేతం!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


