Sprouts:మొలకెత్తిన శనగలు vs మొలకెత్తిన పెసలు – ఏవి ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి..100 గ్రాముల మొలకెత్తిన నల్ల శనగల్లో 20.5 గ్రాముల ప్రోటీన్, 12.2 గ్రాముల ఫైబర్, 57 మి.గ్రా. కాల్షియం ఉంటాయి.
అలాగే 4.31 మి.గ్రా. ఇనుము, 718 మి.గ్రా. పొటాషియం లభిస్తాయి. రోజూ మొలకెత్తిన శనగలు తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. జీర్ణవ్యవస్థ, గుండె ఆరోగ్యం మెరుగుపడతాయి.
మొలకెత్తిన పెసలు కూడా పోషకాలతో నిండి ఉంటాయి. 100 గ్రాముల్లో 23.9 గ్రాముల ప్రోటీన్, 16.3 గ్రాముల ఫైబర్ ఉంటాయి. అంతేకాకుండా 132 మి.గ్రా. కాల్షియం, 6.74 మి.గ్రా. ఇనుము, 1250 మి.గ్రా. పొటాషియం, 4.8 మి.గ్రా. విటమిన్ సి లభిస్తాయి. ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తింటే బరువు సులభంగా తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
పోషక విలువల పరంగా చూస్తే మొలకెత్తిన పెసలు శనగల కంటే కొంచెం మెరుగైనవి అని నిపుణులు చెబుతున్నారు.అయితే, పూర్తి పోషకాహారం కోసం రెండింటినీ కలిపి తినడమే ఉత్తమం!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


