Guava chutney:జామకాయ చట్నీ..డయాబెటిక్ పేషెంట్లకు దివ్య ఔషధం..

Guava chutney
Guava chutney:జామకాయ చట్నీ..డయాబెటిక్ పేషెంట్లకు దివ్య ఔషధం..చల్లని గాలి వీస్తోందంటే చాలు… వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కలిపి, పక్కన ఒక ఘాటైన చట్నీ ఉంటే ఆ భోజనం స్వర్గంలా ఉంటుంది. సాధారణంగా టమాటో, కొత్తిమీర, పుదీనా, మామిడి పచ్చళ్లే తింటూ ఉంటాం కదా… కానీ ఒక్కసారి ఈ జామకాయ చట్నీ టేస్ట్ చేస్తే, మీ రెగ్యులర్ లిస్ట్‌లో టాప్ ప్లేస్ దక్కుతుంది గ్యారంటీ!

జార్ఖండ్‌లో ఈ చట్నీ సూపర్ హిట్. తీపి + పులుపు + కారం… మూడూ ఒకేసారి నాలుక మీద డాన్స్ చేస్తాయి. చేయడం అయితే సూపర్ ఈజీ, ౧౦ నిమిషాల్లో రెడీ!

కావలసిన పదార్థాలు 
పచ్చి జామకాయలు : ౩ (దోర మీడియం సైజు)
పచ్చిమిర్చి : ౩-4 (మీ కారం తట్టుకునే స్థాయికి అజస్ట్ చేసుకోండి)
కొత్తిమీర : అర కప్పు (కాడలు తీసేయండి)
అల్లం :  ఇంచ్ ముక్క
నిమ్మరసం :  టీస్పూన్ (లేదా అర నిమ్మకాయ)
ధనియాల పొడి : ½ టీస్పూన్
జీలకర్ర పొడి : ½ టీస్పూన్
నల్ల మిరియాల పొడి : ½ టీస్పూన్
ఇంగువ : ఒక చిటికెడు
నల్ల ఉప్పు / సైంధవ లవణం : ½ టీస్పూన్ (రుచికి సరిపడా)
నీళ్లు : కొద్దిగా (అవసరమైతే మాత్రమే)

తయారీ విధానం :జామకాయలను బాగా కడిగి, పొడి గుడ్డతో తుడుచుకోండి.  రెండుగా కట్ చేసి, మధ్యలో ఉండే గట్టి విత్తనాలు & తెల్లటి పొరను పూర్తిగా తీసేయండి (ఇది చాలా ముఖ్యం, లేకపోతే చట్నీ గట్టిగా వస్తుంది). మిగిలిన జామకాయను చిన్న ముక్కలుగా తరగండి. 

మిక్సీ జార్‌లో → జామకాయ ముక్కలు + పచ్చిమిర్చి + కొత్తిమీర + అల్లం + అన్ని పొడులు + ఇంగువ + నల్ల ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేయండి. ఒక గిన్నెలోకి తీసి,  టీస్పూన్ నిమ్మరసం పిడికి బాగా కలపండి.అంతే… మీ ఘాటైన, రుచికరమైన జార్ఖండ్ స్టైల్ జామకాయ చట్నీ రెడీ!

వేడి వేడి అన్నంలో నెయ్యి పోసి, ఈ చట్నీతో కలిపి తింటే… ఒక్క మాటలో చెప్పాలంటే “అదిరిపోతుంది బోస్!” రోటీ, చపాతీ, జొన్న రొట్టె, ఇడ్లీ, దోసె… ఏదైనా సూపర్ కాంబినేషన్! ట్రై చేసి చూడండి… ఈ చలికాలంలో మీ ఇంటి ఫేవరెట్ అయిపోతుంది!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top