Bananas waste అవకుండా ఇలా cakes చేస్తే పిల్లలు, అందరు కూడా enjoy చేస్తారు.
కావలసినవి:
మూడు అరటి పళ్ళు, ఒక కప్పు గోధుమపిండి.
చేసే విధానం:
ఒక కేక్ టిన్ తీసుకొని నూనె apply చేసుకోండి. మూడు మీడియం సైజు అరటి పండ్లు తీసుకొని స్పూన్ తో బాగా స్మాష్ చేయాలి , బాగా పండినవి. అరటిపండు కలర్ మారినప్పుడు అంటే బాగా మాగిపోయినప్పుడు, పిల్లలకు తినాలనిపించదు కదా అటువంటివి ఈ రకంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది.
పిల్లలకు ఇలా చేసి పెడితే ఆరోగ్యంగా ఉంటుంది. అరటి పండు కంటే మాగిన అరటిపండు చాలా మంచిది .బాగా smash చేసుకున్న అరటిపండు లోకి ఒక పావు కప్పు వెన్న గాని, నూనె గాని వేసుకోండి మీ ఇష్టం. ఒక ఎగ్ ,ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార, టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ కూడా వేసి, ఒక విష్కర్ తీసుకొని బాగా కలుపుకోండి.
బాగా బ్లెండ్ చేసుకోండి. ఒక జాలి గరిట తీసుకొని banana మిశ్రమంలో ఒక కప్పు గోధుమపిండి వేసుకోండి. ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ,అర టీ స్పూన్ వంటసోడా ,చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఫ్రూట్స్ వేసి చేసే వాటిలో దాల్చిన చెక్క పొడి వేస్తే flavour బాగుంటుంది. మళ్లీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి.
కేక్ బ్యాటర్ ఎప్పుడూ ఒకే యాంగిల్ లోకి రొటేట్ చేసుకుంటూ ఉండాలి .ఉండలు లేకుండా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎగ్స్ skip చేసిన వాళ్ళు ఇలా లాస్ట్ లో కొంచెం కొంచెం పాలు కలుపుకుంటూ blend చేసుకోండి. ఈ విధంగా చేసి పెట్టుకున్న క్రీమ్ ని కేక్ టిన్ లోకి dump చేయండి.
స్టవ్ మీద పాన్ పెట్టి ఒక wholes plate సపోర్ట్ గా ఉండేలాగా రివర్స్ లో పెట్టుకొని ,పాన్ మూత పెట్టేసి 30 టు 40 మినిట్స్ ఒకసారి మూత తీసి చూసుకోండి అది మనకు అంటుకోకుండా ఉంటే ,ప్రిపేర్ అయిపోయినట్టు. కొంచెం అవసరమైతే ఇంకొక టూ మినిట్స్ పెట్టుకోవాలి .చల్లారిన తర్వాత దాన్ని నైఫ్ తో చుట్టూ పైకి లేపుకుంటూ ఒక ప్లేట్ మీద ట్రేస్ చేసుకోండి అంతేనండి..


