Walnuts vs Almonds:నానబెట్టకుండా తింటున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్టే..ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి చాలామంది డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. అందులో ముఖ్యంగా బాదం (Almonds), వాల్‌నట్స్ (Walnuts) ముందుంటాయి. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది తింటే గుండెకు మంచిది? ఏది తింటే మెదడు చురుగ్గా మారుతుంది? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
ఎందుకు నానబెట్టాలి? (The Secret Step) బాదం లేదా వాల్‌నట్స్.. ఏవైనా సరే నానబెట్టి తినడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. వీటిలో సహజంగా ఉండే 'ఫైటిక్ యాసిడ్' (Phytic acid) జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది.నానబెట్టడం వల్ల ఈ యాసిడ్ తగ్గి, పోషకాలు (Nutrients) శరీరాన్ని త్వరగా వంటబడతాయి.నానబెట్టడం వల్ల వాల్‌నట్‌లోని వగరు/చేదు పోయి రుచిగా మారుతుంది.
నానబెట్టిన బాదం: బ్రెయిన్ & బ్యూటీ బాదంలో విటమిన్-E, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
మెదడుకు టానిక్: ఆయుర్వేదం ప్రకారం నానబెట్టిన బాదం జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే దీన్ని 'బ్రెయిన్ ఫుడ్' అంటారు.
ఒత్తిడి మాయం: ఇందులో ఉండే మెగ్నీషియం నరాలను రిలాక్స్ చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది.
గ్లోయింగ్ స్కిన్: నానబెట్టి, పొట్టు తీసిన బాదం తింటే చర్మం మెరుస్తుంది.
షుగర్ కంట్రోల్: రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇది బెస్ట్.
ALSO READ:పెరుగు త్వరగా, రుచిగా తయారవ్వాలంటే ఈ సులభమైన పద్ధతులు పాటించండి!నానబెట్టిన వాల్‌నట్: గుండెకు కవచం వాల్‌నట్ చూడటానికి మెదడు ఆకారంలో ఉంటుంది, అది చేసే మేలు కూడా అదే!
ఒమేగా-3 పవర్: ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను పదిలంగా ఉంచుతాయి.
మంట తగ్గిస్తుంది: శరీరంలో వాపులు (Inflammation) తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
డబుల్ పవర్: సాధారణ జీడిపప్పుతో పోలిస్తే.. నానబెట్టిన వాల్‌నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు రెట్టింపు స్థాయిలో ఉంటాయి.
ఏది త్వరగా జీర్ణమవుతుంది? కచ్చితంగా నానబెట్టిన బాదమే! బాదం పైన ఉండే పొట్టులో 'టానిన్లు' ఉంటాయి. ఇవి పోషకాలను అడ్డుకుంటాయి. కాబట్టి నానబెట్టి, పొట్టు తీసి తింటే ఈజీగా అరుగుతుంది. వాల్‌నట్స్ కూడా నానబెడితేనే తేలికగా జీర్ణమవుతాయి. నానబెట్టకుండా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం వచ్చే ఛాన్స్ ఉంది.
గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ తగ్గడం ముఖ్యం అనుకునేవారికి 'వాల్‌నట్స్' బెస్ట్ ఛాయిస్. మెదడు చురుకుదనం, చర్మ సౌందర్యం, షుగర్ కంట్రోల్ కావాలనుకునేవారికి 'బాదం' బెస్ట్. ఇంకా మంచి ఫలితాల కోసం రోజుకు 4 బాదంపప్పులు, 2 వాల్‌నట్స్ కలిపి తినడం ఉత్తమమని నిపుణుల సలహా.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


