Palli Chikki:వేరుశెనగ పప్పు అచ్చు ఇలా చేసి చూడండి పంటికి అంటుకోకుండా కరకరలాడుతూ ఉంటుంది.. వేరుశనగ చిక్కీ (పల్లీ చిక్కీ లేదా పల్లీ పట్టి) ఒక రుచికరమైనది. వేరుశనగ పప్పు మరియు బెల్లంతో తయారు చేస్తారు – ఇది సంక్రాంతి పండుగలో ప్రత్యేకంగా తింటారు మరియు ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఉపయోగపడుతుంది.
కావలసిన పదార్థాలు:
వేరుశనగ గుళ్ళు (పల్లీలు) - 1 కప్పు
తురిమిన బెల్లం - 3/4 కప్పు
నెయ్యి - 1 టీస్పూన్
యాలకుల పొడి - చిటికెడు
నీళ్లు - 1 లేదా 2 టీస్పూన్లు
తయారీ విధానం:
స్టవ్ మీద బాండీ పెట్టి, వేరుశనగ గుళ్ళను సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. అవి చల్లారాక పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.ఒక ప్లేటుకి లేదా ట్రేకి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చపాతీ కర్రకి కూడా కొద్దిగా నెయ్యి రాసుకోవాలి
బాండీలో తురిమిన బెల్లం మరియు కొద్దిగా నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం కరిగాక వడకట్టి, మళ్ళీ అదే బాండీలో పోసి ముదురు పాకం వచ్చే వరకు ఉడికించాలి
ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో కొద్దిగా పాకం వేయాలి. పాకం కుంచెం ఉండకట్టాకా అప్పుడు స్టవ్ ఆపి, వేయించి పెట్టుకున్న పల్లీలు మరియు యాలకుల పొడి వేసి వేగంగా కలపాలి.
వెంటనే ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో వేసి, చపాతీ కర్రతో సమానంగా, పల్చగా వత్తుకోవాలి.
ఇది వేడిగా ఉన్నప్పుడే చాకుతో మీకు నచ్చిన సైజులో గాట్లు పెట్టుకోవాలి.పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలను వేరు చేసుకోవాలి.
అంతే! కరకరలాడే వేరుశనగ చిక్కీ రెడీ. గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలా రోజులు తాజాగా ఉంటాయి.
ALSO READ:ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగు తింటున్నారా.. అయితే ఈ విషయాన్నీ తెలుసుకోండి..


