New LIC Scheme:ఎల్ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి కడితే చాలు, జీవితాంతం చేతికి డబ్బులు! వివరాలివే.. మీ దగ్గర ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకు డబ్బు ఉందా? అయితే మీ కోసమే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఒక అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది.
అదే 'ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్'. ఒక్కసారి ప్రీమియం కడితే చాలు.. జీవితాంతం ఇన్సూరెన్స్ భరోసాతో పాటు, పెన్షన్ లాంటి ఆదాయం కూడా లభిస్తుంది. నిన్నటి నుంచే (జనవరి 12, 2026) ఈ పాలసీ అందుబాటులోకి వచ్చింది.
ఈ పాలసీ హైలైట్స్ ఇవే:
ప్లాన్ పేరు: ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం (Plan No. 883).
విశేషం: ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. అంటే వాయిదాల పద్ధతిలో కాకుండా, ఒకేసారి డబ్బులు చెల్లించాలి.
ఎవరు అర్హులు?: 30 రోజుల వయసు ఉన్న చిన్నారి నుంచి 65 ఏళ్ల వయసు ఉన్న పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు.
కనీస హామీ: కనీసం రూ. 5 లక్షల సమ్ అష్యూర్డ్ (Sum Assured) తీసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు.
లాభాలు ఎలా ఉంటాయంటే?
ఈ పాలసీలో 'గ్యారెంటీడ్ అడిషన్స్' ఉంటాయి. అంటే ప్రతి వెయ్యి రూపాయల సమ్ అష్యూర్డ్‌కు రూ. 40 చొప్పున ఎల్ఐసీ కలుపుతూ పోతుంది. పాలసీ తీసుకున్న వారికి రెండు రకాల ఆదాయ మార్గాలు (Options) ఉన్నాయి.
ఆప్షన్ 1 (రెగ్యులర్ ఇన్‌కమ్): ఇందులో మీరు ఎంచుకున్న సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం డబ్బును ప్రతి ఏటా మీ చేతికి ఇస్తారు. పాలసీ టర్మ్ బట్టి 7 నుంచి 17 ఏళ్ల తర్వాత ఈ ఆదాయం మొదలవుతుంది.
ఆప్షన్ 2 (ఫ్లెక్సీ ఇన్‌కమ్): మీకు డబ్బులు వెంటనే అవసరం లేకపోతే ఈ ఆప్షన్ బెస్ట్. మీ 10 శాతం డబ్బును ఎల్ఐసీ దగ్గరే ఉంచితే, దానిపై కాంపౌండింగ్ పద్ధతిలో 5.5% వడ్డీ ఇస్తారు. మీకు అవసరమైనప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు.
రిస్క్ కవరేజ్ (Death Benefit)
దురదృష్టవశాత్తు పాలసీదారుడు మరణిస్తే.. నామినీకి భారీ భరోసా ఉంటుంది.చెల్లించిన ప్రీమియానికి 1.25 రెట్లు ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తారు.దీంతో పాటు అప్పటి వరకు జమ అయిన గ్యారెంటీడ్ అడిషన్స్ కూడా ఇస్తారు.
చివరిగా: మీ భవిష్యత్తు కోసం లేదా మీ పిల్లల పేరిట ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేసి, జీవితాంతం నిశ్చింతగా ఉండాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని ఎల్ఐసీ ఏజెంట్‌ను సంప్రదించండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


