Lemongrass Benefits:గడ్డి పోచ అని తీసిపారేయకండి.. ఇది పెద్ద రోగాలకు 'సంజీవని'! రోజూ ఈ టీ తాగితే చాలు..మీ ఇంటి పెరట్లో లేదా కుండీల్లో పెరిగే ఈ పొడవైన గడ్డిని చూసి.. "అబ్బో! పిచ్చి గడ్డి పెరిగిపోయింది" అని పీకేస్తున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్లే!
ఎందుకంటే.. అది సామాన్యమైన గడ్డి కాదు. ఆయుర్వేదంలో "సంజీవని" లాంటి నిమ్మగడ్డి (Lemongrass). దీని వాసన చూస్తేనే మనసు ప్రశాంతంగా మారుతుంది. మరి దీన్ని వాడితే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు.
ఎందుకు ఈ 'నిమ్మగడ్డి' అంత స్పెషల్?
చూడటానికి గడ్డిలా ఉన్నా.. ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
జీర్ణశక్తికి మందు: కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీతో బాధపడేవారికి ఇది బెస్ట్ మెడిసిన్. పేగుల్లో ఉండే చెడు పురుగులను ఇది చంపేస్తుంది.
బీపీ & వెయిట్ లాస్: అధిక రక్తపోటు (BP) ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు నిమ్మగడ్డిని వాడితే మంచి ఫలితం ఉంటుంది.
నొప్పులకు రిలీఫ్: కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, ముఖ్యంగా మహిళల్లో వచ్చే నెలసరి నొప్పులకు (Menstrual Cramps) ఇది సహజ నివారణి.
అందానికి: ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాదు.. చుండ్రు, పేల సమస్యను తగ్గించి జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
అమృతం లాంటి 'లెమన్ గ్రాస్ టీ' తయారీ ఇలా:కేవలం 5 నిమిషాల్లో ఈ హెల్తీ టీని తయారు చేసుకోవచ్చు.
ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించాలి.అందులో కొన్ని నిమ్మగడ్డి ఆకులు (కట్ చేసి) వేసి 5 నిమిషాలు ఉడికించాలి.రుచి కోసం కొంచెం బెల్లం లేదా మెంతి ఆకులు కలపొచ్చు. గోరువెచ్చగా అయ్యాక వడకట్టుకుని తాగేయడమే!
హెల్త్ టిప్: రోజూ ఉదయం ఒక కప్పు లెమన్ గ్రాస్ టీ తాగితే.. ఒత్తిడి తగ్గి రోజంతా ఉల్లాసంగా ఉంటారు. జలుబు, దగ్గు, ఆస్తమా దరిచేరవు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


