Pooja Room Mistakes:దేవుడి గదిలో ఎండిపోయిన పూలు ఉంచుతున్నారా? అయితే దరిద్రం మీ వెంటే.. వెంటనే తీసేయండి!
పూజ గది మన ఇంటికి గుండెకాయ లాంటిది. అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. అయితే, తెలియక చేసే కొన్ని చిన్న తప్పుల వల్ల నెగెటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది.
ప్రధాన తప్పులు:
ఎండిన పూలు: దేవుడికి పెట్టిన పూలు వాడిపోయాక లేదా ఎండిపోయాక వెంటనే తీసేయాలి. వాటిని రోజుల తరబడి అక్కడే ఉంచితే ఇంట్లో 'దరిద్రం' తాండవిస్తుంది.
విరిగిన విగ్రహాలు: పగుళ్లు వచ్చిన విగ్రహాలు లేదా చిరిగిపోయిన ఫోటోలు పూజ గదిలో అస్సలు ఉండకూడదు. ఇవి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి.
ఒకే దేవుడి ఫోటోలు: ఒకే దేవుడికి సంబంధించిన రెండు, మూడు ఫోటోలు లేదా విగ్రహాలు ఎదురెదురుగా ఉండకూడదు. ఇది ఖర్చులను పెంచుతుంది.
వెంటనే మీ పూజ గదిని సరిచూసుకోండి, ఈ వస్తువులు ఉంటే తీసేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


