Kitchen hacks:పంచదార డబ్బాలో చీమలు పడుతున్నాయా? ఈ ఒక్క మసాలా దినుసు వేస్తే చీమలు పరార్.. స్వీట్స్ డబ్బాలో లేదా పంచదారలో చీమలు పట్టడం కామన్ సమస్య.
వంటగదిలో పంచదార డబ్బాకు, స్వీట్లకు చీమలు పట్టడం సర్వసాధారణం. ఎండలో పెట్టినా కొన్నిసార్లు అవి పోవు. చీమల మందు వేస్తే ఆహారం విషతుల్యం అవుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? చీమలకు ఘాటైన వాసనలు పడవు.
లవంగాలు (Cloves): పంచదార డబ్బాలో 4-5 లవంగాలు వేసి మూత పెట్టండి. ఆ ఘాటు వాసనకు చీమలు దరిచేరవు. ఉన్నవి కూడా పారిపోతాయి.
దాల్చిన చెక్క: చీమలు వచ్చే దారిలో కొంచెం దాల్చిన చెక్క పొడి చల్లినా కూడా అద్భుతమైన ఫలితం ఉంటుంది.
నిమ్మరసం: గ్యాస్ కౌంటర్ టాప్ మీద నిమ్మరసం పిండి తుడిస్తే చీమలు రావు. ఈ చిన్న మార్పులతో చీమల సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


