Daliya Upma:ఉప్మా అంటే బోర్ కొడుతోందా? ఇలా కూరగాయలతో 'గోధుమ రవ్వ ఉప్మా' చేస్తే పిల్లలు కూడా ప్లేట్ ఖాళీ చేస్తారు!

Daliya Upma
Daliya Upma:ఉప్మా అంటే బోర్ కొడుతోందా? ఇలా కూరగాయలతో 'గోధుమ రవ్వ ఉప్మా' చేస్తే పిల్లలు కూడా ప్లేట్ ఖాళీ చేస్తారు!

సాధారణ బొంబాయి రవ్వతో చేసే ఉప్మా కంటే, ఎర్ర గోధుమ రవ్వతో (బన్సీ రవ్వ) చేసే ఉప్మా బరువు తగ్గడానికి వంద రెట్లు ఉత్తమం.

కావాల్సిన పదార్థాలు:
గోధుమ రవ్వ (దాలియా): 1 కప్పు
క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు: అర కప్పు
ఉల్లిపాయ, పచ్చిమిర్చి: తగినంత
పోపు దినుసులు, కరివేపాకు, ఉప్పు: తగినంత

తయారీ విధానం:
ముందుగా గోధుమ రవ్వను కొద్దిగా నూనె లేకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.కుక్కర్ లేదా పాన్‌లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు వేయించాలి.అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కూరగాయల ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి.

ఒక కప్పు రవ్వకు 2.5 కప్పుల నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి మరిగించాలి.నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించిన రవ్వను నెమ్మదిగా పోస్తూ కలపాలి. మూత పెట్టి సన్నని మంటపై 10 నిమిషాలు ఉడికిస్తే కమ్మని గోధుమ రవ్వ ఉప్మా సిద్ధం.

ప్రయోజనాలు: ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. కాబట్టి ఆకలి త్వరగా వేయదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top