Quinoa Veg Pulao:అన్నం మానేసి మధ్యాహ్నం పూట ఈ 'కినోవా పులావ్' తింటే.. బొజ్జ ఇట్టే కరిగిపోతుంది.. బరువు తగ్గాలనుకునే వారికి 'కినోవా' ఒక సూపర్ ఫుడ్. ఇది అన్నంలాగే ఉంటుంది కానీ కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.
కావాల్సిన పదార్థాలు: కినోవా - అర కప్పు, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు - అర కప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి - తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, నూనె/నెయ్యి - కొద్దిగా.
తయారీ విధానం: కినోవాను రెండుసార్లు కడిగి 15 నిమిషాలు నానబెట్టాలి. కుక్కర్‌లో కొద్దిగా నెయ్యి వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి.
తర్వాత కూరగాయల ముక్కలు వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. నానబెట్టిన కినోవా వేసి, 1 కప్పు కినోవాకు 2 కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు పోసి 2 విజిల్స్ రానివ్వాలి.
ప్రయోజనాలు: కినోవాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తింటే సాయంత్రం వరకు ఆకలి వేయదు. పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.


