Weight Loss Tip: 3 రోజుల్లోనే రిజల్ట్! వేలాడే పొట్టను మైనంలా కరిగించే వంటింటి చిట్కా ఇదే... మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య 'అధిక బరువు'. శరీరమంతా ఒకెత్తయితే.. పొట్ట, నడుము, తొడల భాగంలో పేరుకుపోయిన మొండి కొవ్వు (Stubborn Fat) తగ్గించుకోవడం మరొక ఎత్తు. ఎంత డైట్ చేసినా, వ్యాయామం చేసినా ఈ భాగాల్లో కొవ్వు అంత తేలికగా కరగదు.
అయితే, మన వంటింట్లో నిత్యం వాడే 'ఉల్లిపాయ' (Onion) తో ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. ఉల్లిపాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన ప్రీబయోటిక్ ఆహారం. ఇది శరీరంలో ఎప్పటి నుంచో పేరుకుపోయిన కొవ్వును మైనంలా కరిగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
ఆ మ్యాజికల్ డ్రింక్ తయారీ విధానం: ఈ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ కోసం కేవలం మూడు సహజ పదార్థాలు చాలు.
కావాల్సినవి:
ఉల్లిపాయ రసం - 2 టీస్పూన్లు
నిమ్మరసం - 1 టీస్పూన్
తేనె - 1 టీస్పూన్
గోరువెచ్చని నీరు - 1 గ్లాసు
తయారు చేసే పద్ధతి:
ముందుగా ఉల్లిపాయను గ్రైండ్ చేసి లేదా తురిమి తాజా రసాన్ని తీసుకోండి.ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల ఉల్లిపాయ రసం, 1 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ తేనె కలపండి. అంతే మీ వెయిట్ లాస్ డ్రింక్ రెడీ.
ఎప్పుడు తీసుకోవాలి?
ఈ మిశ్రమాన్ని ఉదయం పరిగడుపున (Empty Stomach) తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
వారంలో కనీసం 3 సార్లు ఇలా చేస్తే.. శరీరంలో అనవసరమైన కొవ్వు కరగడం మీరే గమనిస్తారు.
ముఖ్య గమనిక (Caution): గ్యాస్, ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఈ డ్రింక్‌ను పరగడుపున తీసుకోకూడదు. అలాంటి వారు బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తీసుకోవడం మంచిది.
అదనపు ప్రయోజనాలు: నిమ్మరసం, తేనె కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


