Ragi Kajjikayalu:ఒక్కటి తింటే చాలు.. ఐరన్, కాల్షియం ఫుల్! పిల్లలకు బెస్ట్ స్నాక్ 'రాగి కజ్జికాయలు'.. రెసిపీ ఇదే!
స్వీట్ అంటే నూనెలో వేయించి, మైదాతో చేసేదే అనుకుంటున్నారా? అస్సలు కాదు! రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే సంప్రదాయ వంటకం "రాగి కజ్జికాయలు". వీటిని నూనెలో వేయించాల్సిన పనిలేదు.. కేవలం ఆవిరి మీద ఉడికిస్తారు. అందుకే ఇది "న్యూట్రియంట్స్ పవర్ హౌస్".
వీటిని ఎందుకు తినాలి?
💪ఎముకలకు బలం: ఇందులో ఉండే రాగి పిండి, నువ్వుల వల్ల కాల్షియం పుష్కలంగా అందుతుంది.
🩸 రక్తహీనత దూరం: బెల్లం, పల్లీలలో ఉండే ఐరన్ వల్ల రక్తం పడుతుంది.
🧠 షార్ప్ బ్రెయిన్: పిల్లలకు రోజుకొకటి ఇస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
🥗 గట్ హెల్త్: ఆవిరి మీద ఉడకడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది.
మరి ఇంత ఆరోగ్యాన్నిచ్చే రాగి కజ్జికాయలను సింపుల్‌గా ఎలా చేయాలో చూసేద్దాం!
తయారీ విధానం (Step-by-Step)
కావాల్సినవి:
రాగి పిండి - 1 కప్పు
బెల్లం తురుము - 2 కప్పులు
పల్లీలు, నువ్వులు, పుట్నాలు (వేపుడు శనగపప్పు) - అర కప్పు చొప్పున
పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు
నెయ్యి, యాలకులు, జీడిపప్పు
STEP 1: పూర్ణం (Stuffing) తయారీ
ముందుగా నువ్వులు, పల్లీలు, పుట్నాలను దోరగా వేయించి, మిక్సీలో బరకగా (మరీ మెత్తగా కాకుండా) పొడి చేసుకోవాలి.
స్టవ్ మీద కడాయి పెట్టి.. ఈ పొడి, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసి సన్నని మంటపై ఉడికించాలి.
బెల్లం కరిగి మిశ్రమం దగ్గర పడ్డాక.. ఒక స్పూన్ నెయ్యి, వేయించిన జీడిపప్పు, గసగసాలు వేసి దించేయాలి. ఇదే మన పూర్ణం!
STEP 2: రాగి పిండి తయారీ
మరో గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసి, అందులో చిన్న బెల్లం ముక్క, చిటికెడు ఉప్పు, స్పూన్ నెయ్యి వేసి మరిగించాలి.
నీళ్లు మరుగుతుండగా రాగి పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయాలి.
STEP 3: కజ్జికాయలు చేయడం
రాగి పిండి మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుని మెత్తని ముద్దలా కలుపుకోవాలి.
చిన్న నిమ్మకాయ సైజు ఉండ తీసుకుని, చేత్తో లేదా పూరీ ప్రెస్‌తో చిన్న చపాతీలా ఒత్తుకోవాలి.
మధ్యలో మనం రెడీ చేసిన పూర్ణం పెట్టి, అంచులు మూసివేసి 'కజ్జికాయ' షేప్ ఇవ్వాలి.
వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టి 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి.
అంతే! నోట్లో వెన్నలా కరిగిపోయే "రాగి కజ్జికాయలు" రెడీ. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్‌గా ఇస్తే.. ప్లేట్ ఖాళీ చేయడం గ్యారెంటీ! ఈరోజే ట్రై చేయండి.


