Soda Side Effects:గ్యాస్ ట్రబుల్ అని సోడా తాగుతున్నారా? ప్రాణాలకే ప్రమాదం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే!
హెవీగా భోజనం చేశాక లేదా పొట్ట ఉబ్బరంగా అనిపించినప్పుడు వెంటనే చల్లని సోడానో, కూల్ డ్రింకో తాగే అలవాటు మీకుందా? "అబ్బా.. ఒక్క సోడా తాగితే సెట్ అయిపోతుంది" అని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే!
ఈ చిన్న అలవాటు మీ అన్నవాహిక (Food Pipe)ను శాశ్వతంగా దెబ్బతీయడమే కాకుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు.
తాత్కాలిక ఉపశమనం.. శాశ్వత నష్టం!
సోడా తాగిన వెంటనే పెద్దగా త్రేన్పు (Belching) వచ్చి పొట్ట తేలికగా అనిపించడం నిజమే. కానీ అది కేవలం భ్రమ మాత్రమే. ఆ ఒక్క త్రేన్పు మీ సమస్యను తగ్గించదు సరికదా, లోపల పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంది.
అసలు లోపల ఏం జరుగుతుందంటే?
గేట్ కీపర్ వీక్ అయిపోతాడు: మన అన్నవాహిక (Food Pipe) మరియు పొట్ట (Stomach) మధ్యలో 'స్పింటర్‌లు' (Sphincters) అనే కండర వలయాలు ఉంటాయి. ఇవి పొట్టలోని యాసిడ్ పైకి రాకుండా కాపాడే గేట్ కీపర్లు. మనం తలకిందులుగా యోగా చేసినా ఆహారం బయటకు రాకపోవడానికి కారణం ఇవే.
యాసిడ్ దాడి: కార్బోనేటెడ్ డ్రింక్స్ లేదా సోడా తాగినప్పుడు, ఈ స్పింటర్‌లు బలహీనపడతాయి లేదా కృత్రిమంగా రిలాక్స్ అవుతాయి. దీంతో గేట్లు తెరుచుకుని పొట్టలో ఉండాల్సిన భయంకరమైన యాసిడ్ అన్నవాహికలోకి ప్రవేశిస్తుంది. దీనినే 'యాసిడ్ రిఫ్లక్స్' అంటారు.
సోడా నుంచి క్యాన్సర్ దాకా..ఈ విషయం వినడానికి చేదుగా ఉన్నా నమ్మాల్సిందే.నిరంతరం సోడా తాగడం వల్ల వచ్చే యాసిడ్ రిఫ్లక్స్ అన్నవాహిక లోపలి పొరను (Mucosa) డ్యామేజ్ చేస్తుంది.
ఇది క్రమంగా 'బ్యారెట్ ఈసోఫేగస్' (Barrett's Esophagus) అనే స్థితికి దారితీస్తుంది. ఇది క్యాన్సర్‌కు తొలి దశ.
గత 20-25 ఏళ్లలో మన దేశంలో అన్నవాహిక మరియు పొట్ట పైభాగంలో వచ్చే క్యాన్సర్లు విపరీతంగా పెరగడానికి ఈ కూల్ డ్రింక్స్ వినియోగమే కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి.
గుండె నొప్పా? గ్యాసా?
చాలామంది చాతిలో మంటగా లేదా నొప్పిగా ఉంటే "గ్యాస్ పట్టేసిందిలే" అని సోడా తాగి నిర్లక్ష్యం చేస్తారు. కానీ అది గుండెపోటు లక్షణం కూడా కావచ్చు. ఇలాంటి సమయంలో సోడా తాగి సమయం వృధా చేయడం వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు.
మీరు ఏం చేయాలి?
గ్యాస్ లేదా ఉబ్బరంగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు లేదా మజ్జిగ తీసుకోండి. సోడా, కూల్ డ్రింక్స్ తాగడం తక్షణమే మానేయండి లేదా తగ్గించండి. నిత్యం గ్యాస్ సమస్య ఉంటే డాక్టర్‌ను సంప్రదించండి తప్ప, సోడాతో స్వంత వైద్యం చేసుకోవద్దు.
గుర్తుంచుకోండి: ఆ ఒక్క సోడా ఇచ్చే కిక్ కంటే.. మీ ఆరోగ్యం చాలా విలువైనది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

