Walking benefits :జిమ్ వద్దు, ఖర్చు లేదు.. రోజుకు అరగంట నడిస్తే మీ శరీరంలో జరిగే అద్భుతాలివే..ఒకప్పుడు కారులో తిరిగితే గొప్ప.. నడిస్తే పేదరికం! కానీ ఇప్పుడు ఆ నడకే అసలైన ఆరోగ్య రహస్యం.
బిజీ లైఫ్‌స్టైల్‌లో జిమ్‌కి వెళ్లి గంటలు గంటలు కష్టపడే సమయం లేని వారికి, ఖరీదైన ఎక్విప్‌మెంట్స్ కొనలేని వారికి ఉన్న ఏకైక సంజీవని.. 'వాకింగ్' (Walking).
శరీరానికి చురుకుదనం, గుండెకు బలం, మనసుకు ప్రశాంతత.. ఇవన్నీ కేవలం నడకతోనే సాధ్యం. అయితే చాలామందికి ఉదయం నడవాలా? సాయంత్రం నడవాలా? రోజుకు ఎన్ని అడుగులు వేయాలి? అనే సందేహాలు ఉంటాయి. వాటన్నింటికీ సమాధానాలు ఇక్కడున్నాయి.
1. ఉదయం వాకింగ్ కుదరకపోతే.. ఎప్పుడు నడవాలి?
ఉదయం పూట కాలుష్యం లేని గాలి, ప్రశాంతత ఉంటుంది కాబట్టి ఉదయం నడక బెస్ట్ అని డాక్టర్లు చెబుతారు. కానీ ఉదయం కుదరని వారు సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య నడవొచ్చు. లేదా రాత్రి భోజనం చేశాక కనీసం గంట ఆగి కాసేపు నడవొచ్చు.
ఆఫీసులో లంచ్ బ్రేక్ సమయంలో కారిడార్‌లో నడిచినా మంచిదే. ఏ సమయంలో నడిచినా.. రోజూ క్రమం తప్పకుండా నడవడం ముఖ్యం!
2. రోజుకు ఎంత నడిస్తే మంచిది?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు లేదా 6,000 నుంచి 10,000 అడుగులు నడవాలి. వారంలో కనీసం 5 రోజులు ఇలా చేస్తే ఆరోగ్యంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అదే మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం రోజుకు 45 నుంచి 60 నిమిషాల పాటు నడవాల్సిందే.
3. నడక వేగం (Speed) ఎలా ఉండాలి?
హాయిగా చుట్టుపక్కల చూస్తూ మెల్లగా నడిస్తే లాభం లేదు. ఆరోగ్యం కోసం చేసే నడక 'బ్రిస్క్ వాక్' (Brisk Walk) అయి ఉండాలి. అంటే.. కాస్త వేగంగా అడుగులు వేస్తూ, పక్కవారికి మాటలు అర్థమయ్యేంత శ్వాస తీసుకుంటూ నడవాలి.
4. వయసును బట్టి ఎవరు, ఎంత నడవాలి?
6 - 17 ఏళ్ల పిల్లలు: రోజుకు కనీసం 60 నిమిషాలు ఆటలు, సైక్లింగ్ లేదా పరుగులు తీయాలి.
18 - 50 ఏళ్ల వారు: రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాలు వేగంగా నడవాలి.
50 ఏళ్లు పైబడిన వారు: రోజుకు 20 నుంచి 30 నిమిషాలు నెమ్మదిగా, స్థిరంగా నడవాలి. అవసరమైతే చేతికర్ర సపోర్ట్ తీసుకోవచ్చు.
5. నడకతో కలిగే లాభాలు.. అన్నీ ఇన్నీ కావు!
గుండె పదిలం: గుండెపోటు రాకుండా నడక దివ్యౌషధంలా పనిచేస్తుంది. బీపీ (BP) కంట్రోల్‌లో ఉంటుంది.
షుగర్ కంట్రోల్: డయాబెటిస్ ఉన్నవారికి షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
వెయిట్ లాస్: అధిక బరువుతో బాధపడేవారికి ఫ్యాట్ కరిగించడానికి వాకింగ్ బెస్ట్ ఆప్షన్.
ఒత్తిడి మాయం: మానసిక ఒత్తిడి తగ్గి, రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర పడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ముఖ్య గమనిక: గుండె జబ్బులు లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం.. ఎంత నడవాలి? ఎంత వేగంగా నడవాలి? అనే విషయంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


