Weight Loss:జిమ్ అవసరం లేకుండా.. ఈ 9 ఆహారాలతో పొట్ట దగ్గరి కొవ్వును ఇట్టే కరిగించేయండి.
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని వేధిస్తున్న సమస్య.. అధిక బరువు! పొట్ట దగ్గర కొవ్వు కరిగించడానికి, బరువు తగ్గడానికి నానా అవస్థలు పడుతున్నారా?
అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి.. బరువు తగ్గడం అనేది కేవలం వ్యాయామం మీదే ఆధారపడి ఉండదు, మనం తినే ఆహారం కూడా అందులో కీలక పాత్ర పోషిస్తుంది.
తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకుంటూ రోజుకు ఓ అరగంట నడిస్తే చాలు.. బరువును సులభంగా నియంత్రించవచ్చు. మరి ఫ్యాట్ బర్న్ చేయడానికి సహాయపడే ఆ 'మ్యాజిక్ ఫుడ్స్' ఏంటో ఇప్పుడే చూద్దాం!
1. ఓట్స్ (Oats) ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి బెస్ట్ ఆప్షన్ ఇది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కొద్దిగా తిన్నా ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. తద్వారా పదే పదే చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది.
2. మెంతులు (Fenugreek) రాత్రిపూట ఒక గ్లాసు నీళ్లలో మెంతులు నానబెట్టి.. ఉదయాన్నే ఆ నీరు తాగి మెంతులను నమిలి మింగేయండి. తినడానికి చేదుగా ఉన్నా.. శరీరంలో మెటబాలిజాన్ని పెంచి కొవ్వును కరిగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
3. సిరిధాన్యాలు (Millets) వైట్ రైస్‌కు గుడ్ బై చెప్పేసి.. రాగులు, జొన్నలు, సజ్జలు లాంటి సిరిధాన్యాలను మీ డైట్‌లో చేర్చుకోండి. వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి.
4. మొలకలు (Sprouts) పెసర్లు, శనగలు లాంటి మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్ హై-లెవల్‌లో ఉంటుంది. ఇవి కండరాలను దృఢంగా మార్చి, అనవసరమైన కొవ్వును చాలా వరకు తగ్గిస్తాయి.
5. గ్రీన్ టీ (Green Tea) రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను (Toxins) బయటకు పంపి బరువు తగ్గేలా చేస్తాయి.
6. చియా & సబ్జా గింజలు వీటిలో ఫైబర్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒక స్పూన్ సబ్జా లేదా చియా గింజలను నీళ్లలో నానబెట్టి తాగితే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఓవర్ ఈటింగ్ కంట్రోల్ అవుతుంది.
7. గుమ్మడికాయ & గింజలు గుమ్మడికాయలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. అలాగే గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తూనే ఆకలిని అదుపులో ఉంచుతుంది.
8. పెరుగు (Curd) పెరుగులోని 'ప్రోబయోటిక్స్' జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడంలో పెరుగు ఎంతో సహాయపడుతుంది.
9. నీటి శాతం ఉండే పండ్లు పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ, క్యాలరీలు తక్కువ. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇక బొప్పాయి అయితే జీర్ణక్రియను వేగవంతం చేసి ఫ్యాట్ బర్నింగ్‌కు బాగా సపోర్ట్ చేస్తుంది.
ముఖ్య గమనిక: ఒక్కోసారి థైరాయిడ్ లేదా హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్ వల్ల కూడా బరువు పెరుగుతూ ఉంటారు. కాబట్టి కొత్త డైట్ ప్రారంభించే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

