KItchen Hacks:బెండకాయ జిగురు లేకుండా కరకరలాడుతూ వేగాలా? హోటల్ చెఫ్‌లు వాడే సీక్రెట్ ఇదే..!

Bendakaya fry
KItchen Hacks:బెండకాయ జిగురు లేకుండా కరకరలాడుతూ వేగాలా? హోటల్ చెఫ్‌లు వాడే సీక్రెట్ ఇదే..!

బెండకాయ కూర అంటే అందరికీ ఇష్టమే. కానీ, దాన్ని వండేటప్పుడు వచ్చే జిగురు చూస్తేనే చాలామందికి విసుగొస్తుంది. ఫ్రై చేద్దామని మొదలుపెడితే అది ముద్దగా మారిపోయి రుచి మొత్తం పోతుంది. అయితే, పెద్దపెద్ద హోటల్స్‌లో మాత్రం బెండకాయ ఫ్రై పొడిపొడిగా, కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుంది కదా! వాళ్లు ఫాలో అయ్యే ఆ సీక్రెట్ ఏంటో మీకు తెలుసా?

మీరు కూడా ఇంట్లో హోటల్ స్టైల్ ‘బెండీ ఫ్రై’ చేయాలనుకుంటే.. ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయిపోండి.

లేత బెండకాయలనే ఎంచుకోండి: మార్కెట్ కి వెళ్లినప్పుడు ముదిరిన, పెద్ద బెండకాయలు అస్సలు కొనకండి. లేతగా, చిన్నగా ఉన్నవాటిని మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే పెద్ద సైజులో ఉండే బెండకాయల్లో సహజంగానే జిగురు ఎక్కువగా ఉంటుంది.

తడి అస్సలు ఉండకూడదు: చాలామంది చేసే పొరపాటు.. బెండకాయలు కడిగిన వెంటనే కట్ చేయడం. అలా కాకుండా, కడిగిన తర్వాత ఒక పొడి కాటన్ క్లాత్ లేదా టవల్ మీద వేసి, తడి పూర్తిగా పోయేలా తుడవాలి. కాయలు పూర్తిగా డ్రై అయ్యాకే కోయడం మొదలుపెట్టాలి.

అసలైన 'చెఫ్' సీక్రెట్ ఇదే (నిమ్మరసం మ్యాజిక్): బెండకాయలు కట్ చేసేముందు కాయల మీద కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ స్ప్రే చేయండి. ఇది పెద్ద హోటల్స్‌లో చెఫ్‌లు వాడే బెస్ట్ టెక్నిక్! నిమ్మకాయలో ఉండే తేలికపాటి ఆమ్లం.. బెండకాయ ముక్కలు జిగురుగా మారకుండా కంట్రోల్ చేస్తుంది. ఫ్రై పొడిపొడిగా వస్తుంది.

కట్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్: పదునుగా లేని చాకుతో కోస్తే బెండకాయ నలిగిపోయి జిగురు ఎక్కువగా బయటకు వస్తుంది. కాబట్టి బాగా షార్ప్ గా ఉన్న చాకును మాత్రమే వాడండి. అప్పుడు కాయ చెదిరిపోకుండా పర్ఫెక్ట్ గా కట్ అవుతుంది.

చివరిగా.. తవా ఫ్రై: బెండకాయలను డీప్ ఫ్రై లేదా నార్మల్ కడాయిలో కాకుండా.. విశాలంగా ఉండే తవా (పెనం) మీద కొద్దిగా నూనె వేసి వేయిస్తే, చాలా త్వరగా క్రిస్పీగా మారుతాయి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

ఇంకెందుకు ఆలస్యం.. ఈ సారి ఇంట్లో బెండకాయ ఫ్రై చేసినప్పుడు ఈ ఒక్క చిన్న చిట్కా ట్రై చేసి చూడండి. ఎప్పుడూ వద్దనే వాళ్లు కూడా లొట్టలేసుకుంటూ తింటారు!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top