Business Ideas:AI తో పనిలేదు.. అర ఎకరం భూమి అక్కర్లేదు: నెలకు రూ.లక్షల్లో ఆదాయం తెచ్చే సూపర్ బిజినెస్ ఐడియా!

fish business
Business Ideas:AI తో పనిలేదు.. అర ఎకరం భూమి అక్కర్లేదు: నెలకు రూ.లక్షల్లో ఆదాయం తెచ్చే సూపర్ బిజినెస్ ఐడియా!

ప్రస్తుతం ఎక్కడ విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ. ఏఐ దెబ్బకు ఐటీ రంగంలో వేలాది ఉద్యోగాలు గల్లంతవుతున్నాయి. భవిష్యత్తులో చాలా వ్యాపారాలు ఆటోమేషన్ పైనే ఆధారపడనున్నాయి. ఇలాంటి కష్టకాలంలో ఏఐ టెక్నాలజీ ఎంత విజృంభించినా.. అస్సలు ఢోకా లేని, ఎప్పటికీ డిమాండ్ తగ్గని రంగం ఒకటుంది. అదే వ్యవసాయం, అనుబంధ రంగాలు!

తక్కువ స్థలంలో, తక్కువ పెట్టుబడితో ప్రతి నెలా లక్షల్లో ఆదాయం సంపాదించే ఓ అద్భుతమైన బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లోనే ‘బయోఫ్లాక్ ఫిష్ ఫార్మింగ్’ (Biofloc Fish Farming) చేపల పెంపకం అనగానే ఎకరాల కొద్దీ చెరువులు, లక్షల్లో పెట్టుబడి గుర్తుకొస్తుంది. కానీ టెక్నాలజీ మారిన ఈ రోజుల్లో ‘బయోఫ్లాక్’ పద్ధతిలో ఇంటి ఆవరణలో లేదా తక్కువ స్థలంలోనే ఫిష్ ట్యాంకులను ఏర్పాటు చేసి భారీగా లాభాలు గడించవచ్చు.

ఈ బిజినెస్ ఎలా ప్రారంభించాలి?
ట్యాంకుల ఏర్పాటు: సిమెంట్, బయోఫ్లాక్ లేదా ప్లాస్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేసుకోవచ్చు. 10,000 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులో సుమారు 1000 నుంచి 1500 చేపలను సులభంగా పెంచవచ్చు.

పెట్టుబడి ఎంత?: ఈ ట్యాంక్ నిర్మాణానికి కేవలం రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు ఖర్చవుతుంది. చేప పిల్లలు, ఫీడ్ తో కలుపుకుని కేవలం రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు.

ఏ చేపలు పెంచాలి?: ఈ పద్ధతిలో తిలాపియా, పంగాసియస్, రోహు రకాల చేపలకు మంచి గ్రోత్ ఉంటుంది.

ఆదాయం ఎలా వస్తుందంటే.. ఒక్కో చేప బరువు 800 గ్రాముల నుంచి కేజీ వరకు పెరిగాక మార్కెట్లో విక్రయించవచ్చు.

మార్కెట్ ధర ప్రకారం కిలో రూ. 150 నుంచి రూ. 200 వరకు పలుకుతుంది.

మీరు 1000 చేపలను పెంచినా.. సుమారు రూ. 1.50 లక్షల ఆదాయం చేతికి వస్తుంది.

ఇందులో మీ ఖర్చులు పోనూ, సులభంగా రూ. లక్ష వరకు నికర లాభం మిగులుతుంది.

మార్కెటింగ్ చాలా ఈజీ! వీటిని స్థానిక చేపల మార్కెట్లు, హోటళ్లు, సూపర్ మార్కెట్లకు సప్లై చేయవచ్చు. లేదా నేరుగా కస్టమర్లకే అమ్మడం ద్వారా అదనపు లాభాలు పొందవచ్చు. అయితే, నీటి నాణ్యత, ఆక్సిజన్ సరఫరా, సరైన ఫీడ్ అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్! ఈ బయోఫ్లాక్ చేపల పెంపకం చేపట్టే వారికి కేంద్ర ప్రభుత్వం ‘పీఎం మత్స్య సంపద యోజన’ కింద ఏకంగా 40 శాతం వరకు సబ్సిడీని అందిస్తోంది. అంతేకాకుండా ఉచిత శిక్షణ, తక్కువ వడ్డీకే లోన్ సదుపాయాలను కూడా కల్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. ఏఐ కే భయం పుట్టించే ఈ బిజినెస్ వైపు అడుగులు వేయండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top