చదువుకుని ఇంటి దగ్గరే ఉంటున్నారా? ఏదైనా జాబ్ చేయాలని ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్. మహిళల కోసం ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందించేందుకు ఒక అద్భుతమైన అవకాశం ముందుకు వచ్చింది. ఈ కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు ఉపాధి దిశగా అడుగులు వేసేలా ప్రోత్సాహం అందిస్తారు.
బేటీ బచావో.. బేటీ పఢావో కింద స్పెషల్ డ్రైవ్..
ఆడపిల్లల సాధికారత, విద్య కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'బేటీ బచావో - బేటీ పఢావో' పథకంలో భాగంగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో మహిళలకు ఉచితంగా కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
ఏయే కోర్సులు నేర్పిస్తారు?
ప్రస్తుత డిజిటల్ కాలంలో కంప్యూటర్ నాలెడ్జ్ లేనిదే ఏ ఉద్యోగం రావడం లేదు. అందుకే..
డేటా ఎంట్రీ (Data Entry),డీసీఏ (DCA),ట్యాలీ (Tally) వంటి డిమాండ్ ఉన్న కోర్సుల్లో నెల రోజుల పాటు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇస్తారు.
శిక్షణ తర్వాత ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. దీని ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించడమే కాకుండా.. ఫ్రీలాన్సింగ్ లేదా సొంత వ్యాపారం చేసుకుని ఆర్థికంగా స్థిరపడవచ్చు.
అర్హతలు ఇవే:
విద్యార్హత: ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
యువతులు, మహిళలు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేయాలి? గడువు ఎప్పటివరకు?
ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల (మార్చి) 26వ తేదీ వరకే గడువు ఉంది. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి, ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 98489 20828 నంబర్‌కు కాల్ చేసి మీ వివరాలు నమోదు చేసుకోండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

