Vastu Tips:వాస్తు ప్రకారం ఇంట్లో తలుపులు, కిటికీలు ఎన్ని ఉండాలో తెలుసా? ఈ తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోండి!
కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు లేదా కొనేటప్పుడు అందరికీ వచ్చే అతి పెద్ద సందేహం.. "ఇంట్లో తలుపులు, కిటికీలు ఎన్ని ఉండాలి? లెక్కపెట్టినప్పుడు అవి సరిసంఖ్యలో (Even Numbers) ఉండాలా లేక బేసి సంఖ్యలో (Odd Numbers) ఉండాలా?"
ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలన్నా, సుఖశాంతులు ఉండాలన్నా వాస్తు శాస్త్రం ప్రకారం తలుపులు, కిటికీల సంఖ్య చాలా ముఖ్యం. దీని గురించి వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో, అసలు లెక్క ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం.
తలుపులు, కిటికీల విషయంలో పాటించాల్సిన వాస్తు నియమాలు:
సరిసంఖ్యే శ్రేయస్కరం: వాస్తు ప్రకారం ఇంట్లో తలుపులు మరియు కిటికీలు ఎల్లప్పుడూ 'సరిసంఖ్యలో' మాత్రమే ఉండాలి. అనగా 2, 4, 6, 8, 12, 14, 16.. ఇలా ఉండాలి. బేసి సంఖ్యలో (ఉదాహరణకు 3, 5, 7, 9) అస్సలు ఉండకూడదు.
సున్నా (Zero) రాకూడదు: సరిసంఖ్య కదా అని లెక్కలో చివర '0' వచ్చేలా పెట్టుకోకూడదు. అనగా 10, 20, 30.. ఇలాంటి సంఖ్యలో తలుపులు/కిటికీలు ఉండకూడదని వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. (ఉదాహరణకు 8 లేదా 12 పెట్టుకోవచ్చు, కానీ 10 వద్దు).
బాత్‌రూమ్ తలుపులు కూడా: లెక్కించేటప్పుడు కేవలం గదుల తలుపులనే కాకుండా.. ఇంట్లోని బాత్‌రూమ్ తలుపులను కూడా కలిపే లెక్కించాలి. అలాగే, ఇంట్లో ఎప్పుడూ తలుపుల కంటే కిటికీల సంఖ్య ఎక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది.
ఎదురెదురుగా ఉంటే అదృష్టం: ఇంట్లో తలుపులు, కిటికీలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.
ప్రధాన ద్వారం (Main Door): ఇంటి సింహద్వారం ఇతర తలుపులన్నింటికంటే పెద్దదిగా, చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండాలి.
బేసి సంఖ్యలో ఉంటే ఏం చేయాలి? (వాస్తు పరిహారం)
ఇప్పటికే ఇల్లు కట్టేసుకుని ఉండి, లెక్కపెట్టినప్పుడు తలుపులు లేదా కిటికీలు బేసి సంఖ్యలో వస్తే కంగారు పడకండి. వాటిని పగలగొట్టి మార్చాల్సిన పనిలేదు. దానికి బదులుగా, ఇంట్లో వీలున్న చోట ఒక చిన్న కిటికీని లేదా తలుపును అదనంగా ఏర్పాటు చేసుకోండి. ఇలా చేస్తే ఆటోమెటిక్‌గా ఆ సంఖ్య సరిసంఖ్యకు మారిపోయి వాస్తు దోషం తొలగిపోతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

