Hair Care Tips:జుట్టు రాలుతోందా? ఇంట్లోనే ఉండే అరటిపండుతో ఇలా చేస్తే.. రిజల్ట్ చూసి షాక్ అవుతారు.. ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం.
కాలుష్యం, పోషకలోపం, ఒత్తిడి వల్ల జుట్టు నిర్జీవంగా మారి, చివర్లు చిట్లిపోయి రాలిపోతూ ఉంటుంది. దీనికి తోడు చుండ్రు సమస్య కూడా తోడైతే ఇక అంతే సంగతులు. అయితే, ఖరీదైన షాంపూలు, ట్రీట్మెంట్ల వెంట పడకుండా మన ఇంట్లో ఉండే ఒకే ఒక్క పండుతో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు. అదే అరటిపండు.
అరటిపండుతో కేవలం ఈ మూడు పదార్థాలు కలిపి వాడితే, మీ జుట్టు సమస్యలు మాయమై ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఆ మ్యాజికల్ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఈ హెయిర్ ప్యాక్ కోసం కావాల్సినవి:
బాగా పండిన అరటిపండు: 1
కాఫీ పొడి: 1 స్పూన్
పెరుగు: 2 స్పూన్లు
ఎలా తయారు చేయాలి?
ముందుగా అరటిపండు తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి.. అందులో ఒక స్పూన్ కాఫీ పొడి, రెండు స్పూన్ల పెరుగు వేయాలి.
వీటన్నింటినీ మెత్తని పేస్ట్‌లా (ఎక్కడా గడ్డలు లేకుండా) మిక్సీ పట్టుకోవాలి. అంతే, హెయిర్ ప్యాక్ రెడీ!
వాడే విధానం:
తయారు చేసుకున్న ఈ పేస్ట్‌ను తల కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు బాగా పట్టించాలి.ఒక అరగంట (30 నిమిషాలు) పాటు ప్యాక్ ఆరనివ్వాలి.
ఆ తర్వాత కుంకుడుకాయలతో (లేదా మైల్డ్ హెర్బల్ షాంపూతో) తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారి చేస్తే మీరే అద్భుతమైన మార్పును గమనిస్తారు.
ఈ ప్యాక్ ఎందుకు అంత బాగా పనిచేస్తుంది?
అద్భుతమైన కండిషనర్: అరటిపండులో పొటాషియం, ప్రోటీన్లు, సహజ నూనెలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తల మాడు (Scalp) మీద తేమను పెంచి, జుట్టుకు సహజమైన కండిషనర్‌లా పనిచేస్తాయి. విటమిన్లు జుట్టు రాలడాన్ని ఆపుతాయి.
చుండ్రుకు చెక్: పెరుగు తలపై చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుతుంది. దీనివల్ల పొడిబారడం తగ్గిపోయి, చుండ్రు (Dandruff) సమస్య పూర్తిగా మటుమాయం అవుతుంది.
జుట్టు పెరుగుదల: అరటిపండు, పెరుగుతో కాఫీ పొడి కలవడం వల్ల తల భాగంలో రక్త ప్రసరణ మెరుగుపడి, జుట్టు కుదుళ్లు ధృడంగా మారతాయి.
ఈ మూడు ఇంగ్రిడియంట్స్ కలిస్తే జుట్టుకు ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తాయి. మరెందుకు ఆలస్యం.. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ వీకెండ్‌లోనే ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

