కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? రోజుకు 1 స్పూన్ ఈ పొడి వాడితే ఎముకలు ఉక్కులా మారాల్సిందే!

Joint Pain Relief Powder
Joint Pains:మారుతున్న జీవనశైలి, గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం, వ్యాయామం లోపం, అధిక బరువు... కారణం ఏదైనా ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. 

ముఖ్యంగా చలికాలంలో ఈ నొప్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఓ అద్భుతమైన 'మ్యాజిక్ పౌడర్'తో ఈ సమస్యలన్నింటికీ శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.

ఎముకలను దృఢంగా మార్చి, నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం కలిగించే ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు:
ఫూల్ మఖానా - 1 కప్పు
బాదం పప్పు - 1 కప్పు
వాల్ నట్స్ - 1 కప్పు
జీడిపప్పు - 1 కప్పు
నువ్వులు - అర కప్పు
గుమ్మడి గింజలు - అర కప్పు
యాలకులు - 4

తయారీ విధానం:
ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి ఫూల్ మఖానా, బాదం పప్పు, వాల్నట్స్, జీడిపప్పు వేసి దోరగా (Dry roast) వేయించి పక్కన పెట్టుకోవాలి.

అదే పాన్‌లో నువ్వులు, గుమ్మడి గింజలు కూడా వేసి కాసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి.
వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారాక, అందులో 4 యాలకులు వేసి మిక్సీలో మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

అంతే, అద్భుతమైన హెల్తీ పౌడర్ రెడీ! ఈ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో ఉంచుకుంటే 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది.

ఎలా వాడాలి? ప్రతిరోజూ ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ ఈ పొడిని కలుపుకుని తాగాలి. తీపి ఇష్టపడే వారు రుచి కోసం అర స్పూన్ బెల్లం కలుపుకోవచ్చు. (గమనిక: డయాబెటిస్ ఉన్నవారు బెల్లం వేసుకోకుండా తాగాలి).

ఈ పొడితో ఇతర అద్భుత ప్రయోజనాలు:
బరువు తగ్గుతారు: ఈ పొడిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు.

జ్ఞాపకశక్తికి బూస్ట్: ఇందులో వాడిన డ్రై ఫ్రూట్స్ వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. వయసు పెరిగే కొద్ది వచ్చే మతిమరుపు సమస్యలు దరిచేరవు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top