మారిన జీవనశైలి, జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం.. కారణం ఏదైనా నేడు చాలామంది అధిక బరువు (Weight Loss) సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఒక అద్భుతమైన న్యాచురల్ డ్రింక్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
కేవలం 10 నుంచి 15 రోజుల్లోనే మీ శరీరంలో మార్పును చూపించే ఎఫెక్టివ్ డ్రింక్ ఇది. దీనిలో ప్రధానంగా మనం ఉపయోగించేది 'క్యాప్సికమ్ (Capsicum)'. బరువు తగ్గించడంలో ఇది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది.
వెయిట్ లాస్ డ్రింక్ తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి, ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు పోయాలి.అందులో సగం క్యాప్సికమ్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.
దానికి ఒక అంగుళం అల్లం (Ginger) ముక్కను సన్నగా తురిమి జతచేయాలి.ఈ మిశ్రమాన్ని కనీసం 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి.
నీరు మరిగిన తర్వాత వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు అర టీస్పూన్ తేనె (Honey) కలుపుకుని తాగాలి.
ఎప్పుడు తాగాలి? ఈ డ్రింక్ ను ఉదయం పరగడుపున లేదా సాయంత్రం వేళల్లో తాగవచ్చు. ఇలా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. (గమనిక: డయాబెటిస్ ఉన్నవారు తేనె వాడకూడదు, దానికి బదులుగా అలాగే తాగడం మంచిది).
ఈ డ్రింక్ ఎలా పనిచేస్తుంది?
క్యాప్సికమ్ మ్యాజిక్: ఇందులో బీటా కెరోటిన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ పెరగదు.
జీర్ణక్రియ మెరుగు: మనం తీసుకున్న ఆహారం కొవ్వుగా మారకుండా, శక్తిగా మారేలా జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తుంది. శరీరంలో జీవక్రియ (Metabolism) రేటును పెంచుతుంది.
అల్లం ప్రయోజనాలు: అల్లం శరీరంలోని వ్యర్థాలను (Toxins) బయటకు పంపుతుంది. అలాగే, త్వరగా ఆకలి వేయకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ డ్రింక్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
కాబట్టి, ఈ నాచురల్ డ్రింక్ ని మీ డైట్ లో చేర్చుకుని ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ప్రయత్నించండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

