వంటగది (Kitchen) ఎంత శుభ్రంగా ఉంచినా.. రాత్రి పూట లైట్లు కట్టేయగానే సింక్ పైపుల నుంచి, డబ్బాల వెనుక నుంచి బొద్దింకలు విపరీతంగా బయటకు వస్తుంటాయి. ఇవి ఆహారంపై వాలి ఎన్నో రకాల రోగాలకు కారణం అవుతాయి.
మార్కెట్లో దొరికే కెమికల్స్ వాడితే ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్న పిల్లలకు మంచిది కాదు. అందుకే మన ఇంట్లో ఉండే సహజమైన వస్తువులతోనే వీటిని శాశ్వతంగా ఎలా తరిమికొట్టాలో చూద్దాం.
బొద్దింకల నివారణ ద్రావణం తయారీ:
ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు పోయాలి.అందులో 2 స్పూన్ల బేకింగ్ సోడా (వంట సోడా) మరియు 2 స్పూన్ల వైట్ వెనిగర్ వేయాలి. ఇవి రెండు కలవగానే నురగ వస్తుంది.
దీనిలో ఒక స్పూన్ డెట్టాల్ (Dettol) లేదా ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత స్ప్రే బాటిల్ (Spray bottle) లో నింపుకోవాలి.
ఎలా వాడాలి?
రాత్రి వంట పూర్తయిన తర్వాత కిచెన్ గట్టును శుభ్రంగా తుడిచేయాలి. ఆ తర్వాత మీరు తయారు చేసుకున్న ఈ ద్రావణాన్ని కిచెన్ సింక్ లోపల, గ్యాస్ స్టవ్ కింద, మరియు బొద్దింకలు తిరిగే మూలల్లో స్ప్రే చేయాలి.
బేకింగ్ సోడా మరియు వెనిగర్ వాసనకు బొద్దింకలు ఊపిరి ఆడక అక్కడికక్కడే చనిపోతాయి, లేదా ఆ వాసనకు మళ్లీ మీ కిచెన్ వైపుకు కూడా రావు. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మీ కిచెన్ ఎంతో ఫ్రెష్‌గా, బొద్దింకల బెడద లేకుండా ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

