రెస్టారెంట్కి వెళ్లినప్పుడు చాలామంది ఆర్డర్ చేసే ఫేవరెట్ వెజ్ కర్రీ 'పన్నీర్ బటర్ మసాలా'. చపాతీ, నాన్ లేదా బిర్యానీలోకి ఇది అద్భుతంగా ఉంటుంది. అయితే, ఇంట్లో ఎంత ట్రై చేసినా ఆ చిక్కటి గ్రేవీ, రుచి రావడం లేదని బాధపడుతున్నారా? అయితే ఏ రెస్టారెంట్ వాళ్లు బయటకు చెప్పని ఈ చిన్న సీక్రెట్ పాటిస్తూ పన్నీర్ కర్రీని ఇలా వండేయండి.
కావాల్సిన పదార్థాలు:
పన్నీర్ ముక్కలు - 250 గ్రాములు
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
టమాటాలు - 3 (పెద్దవి)
జీడిపప్పు - 10 నుండి 12 (నీటిలో నానబెట్టినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
బటర్ (వెన్న) - 2 పెద్ద స్పూన్లు
కారం, ఉప్పు, గరం మసాలా - రుచికి సరిపడా
ఫ్రెష్ క్రీమ్ (పాల మీగడ) - 2 స్పూన్లు (ఇదే అసలైన సీక్రెట్)
తయారీ విధానం:
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, టమాటాలు, నానబెట్టిన జీడిపప్పు వేసి మెత్తగా మగ్గనివ్వాలి. చల్లారాక వీటిని మిక్సీ పట్టి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి.
ఇప్పుడు అదే పాన్లో బటర్ (వెన్న) వేసి కరిగ్యాక, కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి.
ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా-జీడిపప్పు పేస్ట్ వేసి, నూనె పైకి తేలేవరకు ఉడికించాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి.
ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసి మూతపెట్టి 5 నిమిషాలు సన్నటి మంటపై ఉడకనివ్వాలి.
చివరగా రెండు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ (లేదా ఇంట్లో ఉండే పల్చటి పాల మీగడ) పైన వేసి, కొద్దిగా కసూరి మేతి చల్లి దించేయాలి. అంతే.. నోరూరించే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

