రోజూ ఉదయాన్నే ఈ '1 గ్లాస్ జ్యూస్' తాగితే.. పొట్ట, తొడల చుట్టూ కొవ్వు మాయం!

weight loss drink
ఈ మధ్యకాలంలో మారిన జీవన శైలి, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, ఎక్కువసేపు అలా కూర్చుని ఉండిపోవటం, ఎక్కువగా నూనెలో వేగించిన ఆహారాలను తీసుకోవడం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో మనలో చాలామంది బాధపడుతున్నారు.

అయితే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టాలంటే వ్యాయామం చేస్తూ మితంగా ఆహారం తీసుకుంటూ ఇప్పుడు చెప్పే రెమిడీ ఫాలో అయితే మంచి ప్రయోజనం కనబడుతుంది.
అధిక బరువు తగ్గటానికి మార్కెట్లో దొరికే మందులను అస్సలు వాడకూడదు. క్రమబద్ధమైన డైట్ తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే రెమిడీ ఫాలో అయితే సరిపోతుంది.

మూడు ఖర్జూరాలు తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం తీసుకుని శుభ్రంగా కడిగి పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి
పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దానిలో ఒక గ్లాసు నీటిని పోసి కొంచెం వేడి అయ్యాక కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఖర్జూరం మొక్కలు వేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.
ఈ నీటిని వడగట్టి ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసి బాగా కలిపి ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా నెల రోజులపాటు ప్రతిరోజు చేస్తుంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఈ డ్రింక్ లో మనం ఉపయోగించిన అల్లం, కాఫీ కూడా బరువు తగ్గించడానికి చాలా ఎఫెక్ట్ గా పని చేస్తాయి. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. దాంతో సీజనల్గా వచ్చే సమస్యలు ఏమీ లేకుండా ఉంటుంది

అలసట, నీరసం, నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. కాస్త సమయాన్ని కేటాయించి ఈ డ్రింక్ తయారు చేసుకుంటే చాలా చాలా ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు.

చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ డ్రింక్ తయారు చేసుకొని తాగితే మంచి ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top