మనకు సంవత్సరం పొడవునా లభించే కూరగాయలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. అలాంటి కూరగాయలలో క్యాబేజీ కూడా ఒకటి. అయితే మనలో చాలామంది క్యాబేజీ వాసన కారణంగా తినటానికి పెద్దగా ఇష్టపడరు
కానీ క్యాబేజీలో ఉన్న పోషకాలు పరంగా చూస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి చెప్పుకుంటే క్యాబేజీ తినని వారు కూడా తినటానికి ప్రయత్నం చేస్తారు.
క్యాబేజీలో గ్రీన్ క్యాబేజీ, రెడ్ క్యాబేజీ అనే రకాలు ప్రస్తుతం చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. ఒకప్పుడు గ్రీన్ క్యాబేజీ మాత్రమే ఉపయోగించే వారం, కానీ ఇప్పుడు రెడ్ క్యాబేజీ కూడా చాలా విరివిగానే లభ్యం అవటం వలన దానిని కూడా ఎక్కువగానే వాడుతూ ఉన్నాం.
క్యాబేజీలో క్రోమియం సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడమే కాకుండా శరీరంలో కొవ్వు నిలువలు పేరుకు పోకుండా చేస్తుంది.
క్యాబేజీలో విటమిన్స్, ఐరన్, పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన మన శరీరానికి అవసరమైన ప్రయోజనాలను అందిస్తుంది
క్యాబేజీలో బీటా కరోటిన్ ఉండటం వలన కంటి లోపల మచ్చలను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది
అమినో ఆసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన మంటను తగ్గించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఫ్రిరాడికల్స్ కారణంగా మన శరీరం ఇబ్బంది పడకుండా కాపాడుతుంది.
అయితే ఈ లక్షణాలు రెడ్ క్యాబేజీలో ఎక్కువ ఉన్నాయట. క్యాబేజీ రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్ లో యాంటీ అల్సర్ లక్షణాలు ఉండటం వలన కడుపులో మంట కడుపులో పూతలు తగ్గుతాయి.
కడుపులో మంటగా ఉన్నప్పుడు కొంచెం క్యాబేజీని తీసుకుని ఉడికించి నీటితో సహా క్యాబేజీని మిక్సీ చేసి ఆ జ్యూస్ తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.
క్యాబేజీని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే క్యాబేజీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారు క్యాబేజీ సూపును ఎంతైనా తాగొచ్చు. బరువు పెరుగుతామని భయం ఉండదు
క్యాబేజీలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగి మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ రావు.
క్యాబేజీలో లాక్టిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన గొంతు నొప్పి నుండి ఉపశమనం కొరకు చాలా బాగా సహాయపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే క్యాబేజీ దగ్గుకు ఒక మంచి మందుగా పని చేస్తుంది.
క్యాబేజీ రసం తాగలేని వారు కొంచెం తేనె కలుపుకొని తాగవచ్చు అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితేనే మంచిది.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న క్యాబేజీని వారంలో రెండుసార్లు తీసుకుంటే వాటిలో ఉన్న పోషకాలు మన శరీరాన్ని అంది ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెడుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

